హీరోయిన్ అనుపమ మిస్సింగ్.. కంగారులో చిత్ర బృందం

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 1, Sep 2018, 10:01 AM IST
heroine anupama praksh missing from shooting spot
Highlights

సీరియస్ గా సినిమా షూటింగ్ జరుగుతుంటే.. అక్కడి నుంచి సడెన్ గా హీరోయిన్ కనిపించకుండా పోయింది. 

సీరియస్ గా సినిమా షూటింగ్ జరుగుతుంటే.. అక్కడి నుంచి సడెన్ గా హీరోయిన్ కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. భయంతో ఆమె షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయిందని తెలుసుకున్నాక.. ఆ చిత్ర బృందం అంతా ఊపిరి పీల్చుకుంది. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 ‘అవళుక్కెన్న అళగియ ముగం’ చిత్రంలో నటిస్తున్న నటి అనుపమా ప్రకాష్‌ షూటింగ్‌ స్పాట్‌ నుంచి అనూహ్యంగా అదృశ్యమయ్యారు. దీనిపై ఆరా తీయగా కొండ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతంలో తన చేత నృత్యం చేయించడంతో భయాందోళనకు గురయ్యారని, దీంతో ఆమె తన స్వస్థలానికి వెళ్లిపోయిందని చిత్ర బృందం గుర్తించింది.

 కదిరవన్‌ స్టుడియోస్‌ నిర్మాణంలో ‘అవళుక్కెన్న అళగియ ముగం’ రూపొందుతోంది. ఎ.కేశవన్‌ దర్శకుడు. వైరముత్తు పాటలు రాశారు. ఇందులోని పాటల సన్నివేశాలను కొడైక్కెనాల్‌ కొండ ప్రాంతంలో చిత్రీకరించారు. అత్యంత ఎత్తైన ప్రాంతంలో సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఆ ప్రాంతాన్ని చూసి ఆమె భయాందోళనకు గురయ్యారు. అనూహ్యంగా షూటింగ్‌ నుంచి ఎవరికి చెప్పకుండా తన గదికి వెళ్లిపోయిన ఈమె.. తర్వాత చిత్ర బృందానికి తెలియకుండా మదురై వెళ్లిపోయింది.

 అక్కడి నుంచి విమానంలో దిల్లీ వెళ్లింది. ఈ విషయం తెలియని చిత్ర బృందం ఆమె కోసం అనేక చోట్ల గాలించింది. చివరకు ఆమె దిల్లీ వెళ్లారన్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. తర్వాత నిర్మాత దిల్లీ వెళ్లి ఆమెను బుజ్జగించడంతో పాటు తిరిగి షూటింగ్‌లో పాల్గొనడానికి చెన్నైకి తీసుకొచ్చారు. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది.

loader