ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 14 కోట్ల హెరాయిన్ పట్టివేత.. ఉగాండాకు చెందిన మహిళ బ్యాగ్‌లో..

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో (Indira Gandhi International Airport) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఉగాండాకు చెందిన మహిళ (woman from Uganda) వద్ద నుంచి అధికాలురు 2 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకన్నారు.

heroin worth rs14 crore caugh from uganda woman at Delhi airport

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో (Indira Gandhi International Airport) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఉగాండాకు చెందిన మహిళ (woman from Uganda) వద్ద నుంచి అధికాలురు 2 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 14.14 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న మహిళను పోలీసులు అడ్డగించారు. ఆమె బ్యాగును తనిఖీ చేయగా, 2020 గ్రాముల ఆఫ్‌ వైట్‌కలర్‌లో ఉన్న పౌడర్‌ను గుర్తించారు. దానిని పరీక్షించగా అది heroin అని తేలింది. దీంతో ఆ విదేశీ మహిళపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 కింద అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

మహిళ దుబాయ్ నుంచి వచ్చిందని.. తమకు ముందస్తుగా ఉన్న సమాచారంతో ఆమె లగేజ్‌ను తనిఖీ చేసినట్టుగా కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఇక, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఢిల్లీ 100 కిలోల వరకు హెరాయిన్‌ అధికారులు స్వాధీనం చేసుకొని, 26 మందిని అరెస్టు చేశారు. 

ఇదిలా ఉంటే ఆదివారం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కెన్యాకు చెందిన 33 ఏళ్ల మహిళ నుంచి కూడా అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె వద్ద రెండు కిలోల కన్నా ఎక్కువ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 15 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం ఆ మహిళను అరెస్ట్ చేశారు. 

ఎయిర్‌ అరేబియా విమానంలో షార్జా నుంచి వచ్చిన ఆ మహిళను లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) ఆధారంగా అధికారులు విమానాశ్రయంలో అడ్డగించారు. నవంబర్ 13న ఢిల్లీ విమానశ్రయంలో ఉగాండాకు చెందిన ఇద్దరు మహిళా ప్రయాణికులు 12.9 కిలోల హెరాయిన్‌తో పట్టుబడ్డారు. దాని విలువ రూ. 90 కిలోలు ఉంటుంది. అయితే వారు ఏ మొబైల్ నెంబర్ అయితే పొందుపరిచారో.. అదే నెంబర్‌ను కెన్యాకు చెందిన మహిళ కూడా తన వీసా దరఖాస్తులో పేర్కొంది. దీంతో ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆమెపై ఎల్‌వోసి సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమలోనే పోలీసులు కెన్యా మహిళను అడ్డగించి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios