Asianet News TeluguAsianet News Telugu

కేరళలో బీభత్సం: హెల్ప్‌లైన్లు, విరాళాలకు బ్యాంకు ఖాతాలివే

కేరళలో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేరళ సర్కార్ అప్రమత్తమైంది

here's kerala floods helpline, emergency contacts, ways to donate for the effected
Author
Kerala, First Published Aug 17, 2018, 7:10 PM IST

తిరువనంతపురం: కేరళలో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేరళ సర్కార్ అప్రమత్తమైంది.కేరళ ప్రజలను ఆదుకొనేందుకు సహాయం చేసేందుకు విరాళాలు ఇవ్వాలని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు.

కేరళలో భారీ వర్షాల కారణంగా సుమారు 324 మంది మృత్యువాతపడ్డారు.వందేళ్ల తర్వాత కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 80 ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు రెండున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 

భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కేరళ లో నిరాశ్రయులైన ప్రజలకు ఆర్థిక సహాయం చేసేందుకుగాను  విరాళాలు ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం విజయన్ కోరారు.

ఆ మేరకు htttps://donation.cmdrf.kerala.gov.in/ లేదా ముఖ్యమంత్రి డిజాస్టర్స్ రిలీఫ్ ఫండ్ కు నేరుగా విరాళాలలను ఇవ్వొచ్చని ఆయన ప్రకటించారు.

ఎస్‌బీఐ ఖాతా 67319948232 , తిరువనంతపురం బ్రాంచ్ , ఐఎప్‌ఎస్‌సీ కోడ్.SBIN0070028, PAN. AAAGD0584M ,swift code. SBINIINBBBT08 ... ద్వారా చెల్లించవచ్చని కోరారు.

చెక్‌లు,  డీడీల రూపంలో కూడ విరాళాలను స్వీకరించనున్నట్టు  సీఎం విజయన్ ప్రకటించారు. 

మరోవైపు పలుజిల్లాల్లో భారీ వర్షాలతో ఇబ్బందిపడుతున్న ప్రజలు తమ అవసరాల కోసం అధికారులను సంప్రదించేందుకుగాను కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు.ఆయా జిల్లాల్లోని కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అవసరమైన వారు ఆయా ఫోన్లలో అధికారులను సంప్రదించాలని కోరింది. మరో వైపు ప్రధానమంత్రి మోడీ కేరళలో వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు కేరళ బయలుదేరి వెళ్లారు.

కేరళలలో పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ ల నెంబర్లు

కాసర్‌గోడ్: 9446601700

కన్నూర్: 91-944-668-2300

కోజికోడ్: 91-944-653-8900

వాయనాడ్: 91-807-840-9770

మలప్పురం: 91-938-346-3212

మలప్పురం: 91-938-346-4212

త్రిసూర్: 91-944-707-4424

త్రిసూర్: 91-487-236-3424

పాలక్కాడ్: 91-830-180-3282

ఎర్నాకుళం: 91-790-220-0400

ఎర్నాకుళం: 91-790-220-0300

అలప్పుజా: 91-477-223-8630

అలప్పుజా: 91-949-500-363

Follow Us:
Download App:
  • android
  • ios