Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ రైల్వే లైబ్రరీలో చదివి... ఓ కంపెనీకి సీఈవో అయ్యాడు..!

ఆయన ఒకప్పుడు ఇండియన్ రైల్వే లైబ్రరీలో చదువుకునేవాడు. ఇప్పుడు హార్వెస్టింగ్ ఫార్మర్స్ నెట్ వర్క్ అనే సంస్థకు  వ్యవస్థాపకుడిగా మారాడు

Here how Indian Railway Library helped this CEO Fulfill his Dream
Author
First Published Mar 18, 2023, 9:43 AM IST

ఒకప్పుడు స్ఫూర్తిదాయకమైన కథలు కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివేవాళ్లం. ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత... చాలా మంది గొప్పవారి జీవితాలను తెలుసుకోగలుగుతున్నాం. ఓ వ్యక్తి విజయం సాధించడానికి ఎంత కష్టపడ్డాడో తాజాగా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ కథ హార్వెస్టింగ్ ఫార్మర్స్ నెట్ వర్క్ వ్యవస్థాపకుడు, సీఈవో రుచిత్ జి గార్గ్ విజయ గాద.

ఆయన ఒకప్పుడు ఇండియన్ రైల్వే లైబ్రరీలో చదువుకునేవాడు. ఇప్పుడు హార్వెస్టింగ్ ఫార్మర్స్ నెట్ వర్క్ అనే సంస్థకు  వ్యవస్థాపకుడిగా మారాడు. తనకు ఆ లైబ్రరీలో చదవడం ఎంత ఉపయోగపడిందో ఆయన స్వయంగా వివరించారు.

 


గార్గ్ తన జ్ఞానాన్ని పెంచుకోవడానికి భారతీయ రైల్వే లైబ్రరీ ఎలా సహాయపడిందో వివరంగా చెప్పాడు. “సుమారు 35 సంవత్సరాల క్రితం నేను మా నాన్నను కోల్పోయినప్పుడు, మా అమ్మ ఇండియన్ రైల్వే లైబ్రరీలో క్లర్క్‌గా పని చేయడం ప్రారంభించింది, ఆ లైబ్రరీ అధికారులు/సిబ్బంది కోసం ఏర్పాటు చేశారు. మాకు చాలా తక్కువ స్తోమత ఉంది, పుస్తకాలతో కొనే  స్థోమత కూడా లేదు- నాకు ఆసక్తి ఉన్న అన్ని విషయాలను అక్కడి పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాను, ”అని అతను క్యాప్షన్‌లో రాశాడు.
కాగా... ఆయన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. అతని కృషి, పట్టుదలను అందరూ ప్రశంసిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios