బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలకు  రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌పై కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రాజ్యసభ, లోక్‌సభలలో వరుసగా రెండో రోజు  వాయిదా పడ్డాయి.

సినీ నటీ, బీజేపీ పార్లమెంటు సభ్యురాలు హేమా మాలిని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ‘మరో దేశంలో ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు’ అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో అన్నారు.

"మన ప్రధానమంత్రి భారతదేశం పేరును ప్రపంచవ్యాప్తం చేయడానికి చాలా కష్టపడ్డారు. రాహుల్ గాంధీ వేరే దేశం దాటి వెళ్లి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదు. ఏది ఏమైనా, వారు దానిని పార్లమెంటులో పరిష్కరించుకోగలరు. విదేశాల్లో కాదు." అని అన్నారు. అనంతరం హేమ మాలిని అస్కార్ విజేతలను ప్రశసించారు. తెలుగు సినిమా 'RRR', తమిళ షార్ట్ 'ఎలిఫెంట్ విస్పరర్స్' టీమ్స్ ను అభినందించారు.

పార్లమెంటు బడ్జెట్ సెషన్ రెండవ భాగం సోమవారం ప్రారంభమైంది. UKలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి, ఇతర అనుబంధ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో సభలో తరుచు గందరగోళంలో నెలకొంటుంది. ఇటీవల UK పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో తన అనుభవం, బ్రిటిష్ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.

చైనాతో సరిహద్దు స్టాండ్-ఆఫ్ నుండి పెగాసస్ స్పైవేర్ వివాదాల వరకు అనేక సమస్యలను చర్చించారు. భారతదేశంలోని ప్రతిపక్ష చట్టసభ సభ్యులను తిరస్కరించారని పేర్కొన్నారు. వారి అభిప్రాయాలను వినిపించే హక్కు లేకుండా పోయిందని తెలిపారు. సంస్థను, భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించినందుకు గాంధి పార్లమెంటుకు క్షమాపణలు చెప్పాలని ఆగ్రహించిన బీజేపీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఉభయ సభలు వరుసగా రెండో రోజు ఈ మధ్యాహ్నం వాయిదా పడ్డాయి.

అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పేరు ప్రస్తవించకుండా .. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 'పార్లమెంటును అవమానించారని' ఆరోపించారు... "నిన్న మేము చాలా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తాము. భారతదేశాన్ని అవమానించిన తీరు... లోక్‌సభ , రాజ్యసభ రెండూ కూడా ఇందులో భాగమే. పార్లమెంటును అవమానించారు." అని పేర్కొన్నారు. గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా ఇతర బిజెపి నాయకులు కాంగ్రెస్ మాజీ చీఫ్ పై విమర్శలు గుప్పించారు.