Asianet News TeluguAsianet News Telugu

Pawan Hans helicopter crash: పవన్ హన్స్ హెలికాప్టర్ క్రాష్‌.. ముగ్గురు ONGC ఉద్యోగులు స‌హా నలుగురు మృతి

Pawan Hans helicopter crash:అరేబియా సముద్రంపై వెళ్తున్న ఒక హెలికాప్టర్ సడెన్‌గా అదుపుతప్పింది. అది ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతంలో కాకుండా సముద్రంలో పడిపోయింది. 
 

helicopter crash: 3 ONGC employees among 4 dead in Pawan Hans helicopter crash
Author
Hyderabad, First Published Jun 28, 2022, 6:18 PM IST

Pawan Hans helicopter crash: అరేబియా సముద్రంలో పవన్‌ హన్స్‌ హెలికాప్టర్ కూలిన ప్ర‌మాదంలో ముగ్గురు ఓఎన్‌జీసీ ఉద్యోగులతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయార‌ని అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంపై వెళ్తున్న ఒక హెలికాప్టర్ సడెన్‌గా అదుపుతప్పింది. అది ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతంలో కాకుండా సముద్రంలో పడిపోవ‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..  మంగ‌ళ‌వారం ఉదయం 1146 గంటలకు మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్-ఎంఆర్సిసి (ముంబై)కు ఆస్ట్రేలియన్, ఇండియన్ ఎంసీసీ నుంచి ఈఎల్టీ డిస్ట్రెస్ అలర్ట్ అందుకుంది. ముంబై హైలో ఓఎన్జీసీ విధులకు పనిచేస్తున్న పవన్ హన్స్ హెలికాప్టర్ (సికోర్స్కీ ఎస్-76డి) నుంచి ఈ హెచ్చరికను ఎంఆర్సిసీ ముంబై వెంటనే గుర్తించింది. ఓఎన్జీసీ హెలికాప్టర్ లో ఇద్ద‌రు పైలట్లు, 07 మంది సిబ్బందితో చమురు ప్లాట్ ఫామ్ పై అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా సముద్రంలోకి దూసుకెళ్లింది. MRCC (ముంబై) వెంటనే వివరాలను ట్రేస్ చేసి, అత్యవసర శోధన మరియు రెస్క్యూ కోసం వాటాదారులందరినీ అప్రమత్తం చేసింది. సమీప నౌకలను అలర్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ సేఫ్టీ నెట్ యాక్టివేట్ చేయబడింద‌న్నారు. 
 

ఎంఆర్ సీసీ  (ముంబై) ఓఎన్జీసీ కంట్రోల్ రూమ్ మరియు నవా బేస్ తో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ను సమన్వయం చేసింది. భారత నావికాదళానికి అత్యవసర స‌హాయాన్ని కూడా కోరింది. తదనుగుణంగా నావల్ సీకింగ్ మరియు ALH వెంటనే ప్రారంభించబడ్డాయి. ఓఎస్వీ మాలవీయ-16 ప్రాణాలతో బయటపడిన న‌లుగురిని రక్షించగా, ఓఎన్జీసీ రిగ్ సాగర్ కిరణ్ ప్రయోగించిన లైఫ్ బోట్ ద్వారా ఒక‌రు ప్రాణాల‌తో బయటపడ్డారు. మొత్తం న‌లుగురు ఈ ప్ర‌మాదం నుంచి ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. ర‌క్షించిన వారిని వెంట‌నే వైద్యం కోసం జుహు ఎయిర్ బేస్ కు తరలించారు. భాగస్వాములందరి సమన్వయంతో కూడిన ప్రయత్నాలతో రెస్క్యూ ఆపరేషన్ 02 గంటల్లోనే ముగిసింద‌ని అధికారులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios