ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్  అంత్యక్రియలు ఇవాళ ఉదయం  నిర్వహించారు. అతి కొద్ది మంది  సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. 

గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు శుక్రవారంనాడు నిర్వహించారు. అస్వస్థతతో హీరాబెన్ అహ్మదాబాద్ లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఉదయం 3:30 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. అహ్మదాబాద్ లోని యుఎస్ మెహాతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆమె మృతి చెందింది. 

ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటిన గుజరాత్ కు చేరుకున్నారు. తల్లి పార్థీవదేహనికి నివాళులర్పించారు. తల్లి మృతదేహన్ని చూసి ప్రధాని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. ఇవాళ ఉదయం హీరాబెన్ అంత్యక్రియలను నిర్వహించారు. తల్లి పార్థీవ దేహం ఉన్న పాడెను మోడీ స్వయం గా మోశారు. ఇవాళ జరిగే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకోకుండా ప్రధాని అహ్మదాబాద్ వెళ్లినట్టుగా సమాచారం.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాలో వందే భారత్ రైలును ప్రధాని ఇవాళ ప్రారంభించనున్నారు. దీంతో పాలు పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. హీరాబెన్ గుజరాత్ రాష్ట్రంలోని మెహసానాలోని వాద్ నగర్లో 1923 జూన్ 19న జన్మించారు. ఆమెకు ఐదుగురు కుమారులు,ఒక కూతురున్నారు. ఆరుగురిలో ప్రధాని మోడీ మూడో వ్యక్తి. గాంధీనగర్ కు సమీపంలో రైసన్ గ్రామంలో ప్రధాని సోదరుడు పంకజ్ మోడీతో ఆమె ఉంటున్నారు.హీరాబెన్ మృతికి పలువురు సంతాపం తెలిపారు.