పాట్నా: భారీ వర్షాలతో బీహార్ లోని 15 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. ఫలితంగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. సాధారణ జనజీవితం స్తంభించింది.

గత 24 గంటల్లో రాష్ట్రంలో 98 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సుపౌల్, దర్బంగ వాతావరణ కేంద్రాలు 81.6, 61.2 మిల్లీమిటర్ల వర్షపాతాన్ని నమోదు చేశాయి. భాగల్పూర్ లో 134.03 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

 

బీహార్, హిమాచల్ ప్రదేశ్ , గుజరాత్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వచ్చే 24 గంటలు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కార్యాలయం అంచనా వేసింది. 

భారీ వర్షాల కారణంగా బీహార్ లోని మధుబని, సుపౌల్, సహాసా, పుర్నియా, దర్బంగ, భాగల్పూర్, ఖగారియా, కతిహార్, వైశాలి ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఈస్ట్ చంపారన్, పి చంపారన్, పూ చంపారన్, శివ్ హార్, బెగుసరాయ్, సీతామర్హి, సరన్, సివాన్, బెగుసరాయ్, భోజ్ పూర్ పది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. 

వర్షాల కారణంగా నీరు చేరడం కారణంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ కుమార్ రవి ఆదేశించారు.