Tamil Nadu, Puducherry Heavy Rains : తమిళనాడు,  పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలోని స్కూల్స్, కాలేజీలకు అధికారులు సెలువులు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

Tamil Nadu, Puducherry Heavy Rains : తమిళనాడు, పుదుచ్చేరిలో వానలు దంచి కొడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా తమిళనాడులోని విల్లుపురం, అరియలూరు, కడలూరు, నాగపట్టణం, పుదుచ్చేరి, కరైకల్ జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఆయా జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి, ఒకరికి గాయాలు

కాగా.. తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. 

Scroll to load tweet…

‘‘ఆరెంజ్ అలర్ట్! తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ తీర ప్రాంతాల్లో నవంబర్ 13, 14 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (115.6 నుంచి 204.4 మిల్లీమీటర్లు) కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ సురక్షితంగా ఉండండి, సహాయం కోసం సమాచారం ఇవ్వండి.’’ అని పేర్కొంది.

Scroll to load tweet…

ఇదిలా ఉండగా భారీ వర్షాలకు నాగపట్నం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మదురై జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి
 కాగా.. గత వారం కూడా తమిళనాడులో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయం కావడంతో పాఠశాలను మూసివేశారు. అంతకుముందు రాష్ట్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్‌.ముత్తుసామి జిల్లా పరిపాలన అధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.