Asianet News TeluguAsianet News Telugu

దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీ వ‌ర్షం.. గురుగ్రామ్, నోయిడాలో పాఠ‌శాల‌ల మూసివేత‌..

ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 

Heavy rain in Delhi, the capital of the country.. Schools closed in Gurugram and Noida..
Author
First Published Sep 23, 2022, 11:16 AM IST

దేశ రాజధానిలో వరుసగా రెండో రోజు గురువారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. నగరంలోని కీలక రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం కూడా నగరంలోని చాలా చోట్ల మోస్తరు వర్షం పడుతుందని ప్రజలను హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ (IMD) ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

Rainfall: దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వీకెండ్ వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు

ఢిల్లీలో ఈ వీకెండ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల దృష్ట్యా, శుక్రవారం నోయిడా, గురుగ్రామ్‌లలో ప్రైవేట్ పాఠశాలలను (8వ తరగతి వరకు) మూసివేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో సుదీర్ఘ ట్రాఫిక్ క‌ష్టాలలు మొద‌ల‌య్యాయి. ఆ ప్రాంతంలో మరింత వర్షం కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల సాధారణంగా ఆకాశం మేఘావృతమై మోస్తరు ఉరుముల‌తో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీల సెల్సియస్‌, 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

‘‘ఢిల్లీ వైపు తాజా మేఘం చేరుకుంటోంది. దీని వల్ల వచ్చే 3-4 గంటల్లో ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాలలో అప్పుడప్పుడు తీవ్రమైన స్పెల్‌లతో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ’’ అని వాతావరణ శాఖ ఒక ట్వీట్‌లో తెలిపింది. 

శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గురుగ్రామ్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇఫ్కో చౌక్, శంకర్ చౌక్, రాజీవ్ చౌక్, గుర్ గావ్ - ఢిల్లీ సరిహద్దు సమీపంలోని సర్హౌల్‌తో సహా, నేషనల్ హైవే (NH) 48లోని అనేక మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది.

ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాల కారణంగా రోడ్లు నీట మున‌గ‌డంతో పాద‌చారులు నడిచేందుకు కూడా ఇబ్బంది ప‌డ్డారు. వారంతా ప్రధాన రహదారుల గుండా నడవవలసి వచ్చింద‌ని ‘ఇండియా టు డే’ నివేదించింది. కాగా.. గౌతమ్ బుద్ధ్ నగర్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంద‌ని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios