Bengaluru: గ‌త‌ 24 గంటల్లో దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో కురిసిన వర్షాలకు మొత్తం 35 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 12 ఇళ్లు పాక్షికంగా, ఒక ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయని దక్షిణ కన్నడ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇదే స‌మ‌యంలో మెస్కాంకు చెందిన 108 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు, 5.02 కిలోమీటర్ల విద్యుత్ సరఫరా లైన్ దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. 

Karnataka Rains: క‌ర్నాట‌క‌లో వాన‌లు దంచికొడుతున్నాయి. భారీ వ‌ర్షాలు కార‌ణంగా రాష్ట్రంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 8కి చేరుకుంది. గ‌త‌ 24 గంటల్లో దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో కురిసిన వర్షాలకు మొత్తం 35 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 12 ఇళ్లు పాక్షికంగా, ఒక ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయని దక్షిణ కన్నడ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇదే స‌మ‌యంలో మెస్కాంకు చెందిన 108 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు, 5.02 కిలోమీటర్ల విద్యుత్ సరఫరా లైన్ దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి సంబంధిత అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. క‌ర్నాట‌క‌లో భారీ వ‌ర్షాల కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతి చెందడంతో జంట తీర జిల్లాలైన దక్షిణ కన్నడ, ఉడిపిలో వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ తాలూకా నందవర గ్రామంలో కొండ భాగం కూలి 47 ఏళ్ల మహిళ మృతి చెందింది. శిథిలాల నుంచి ఆమె 20 ఏళ్ల కుమార్తెను రక్షించారు. ఉడిపి జిల్లాలో గురువారం రాత్రి కర్కల-పడుబిద్రి రాష్ట్ర రహదారిపై బెల్మన్ పట్టణం గుండా వెళ్తుండగా భారీ చెట్టు వాహనంపై పడటంతో బైక్ రైడర్ ప్రాణాలు కోల్పోయాడు.

బాధితుడు ప్రవీణ్ ఆచార్య (30) పిలార్ కు చెందినవాడు. రాత్రి 9.30 గంటల సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ వారంలో జంట జిల్లాల్లో వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరిందనీ, దక్షిణ కన్నడలో ఐదుగురు, ఉడిపిలో ముగ్గురు మరణించారని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. మరో ఘటనలో ఉడిపి సమీపంలోని కలియన్ పుర-సంతెకట్టె జంక్షన్ వద్ద 66వ నెంబరు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న అండర్ పాస్ లో కొంత భాగం బుధవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కూలిపోయింది.

ప్రస్తుతానికి క్యారేజ్ వే ద్వారా వాహనాలను అనుమతిస్తున్నప్పటికీ అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, కొండకు వెళ్లే మార్గం జారిపోవడంతో దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకా గడై కల్లులో శుక్రవారం నుంచి ట్రెక్కింగ్ ను అటవీశాఖ నిషేధించింది.