Asianet News TeluguAsianet News Telugu

అదే భద్రత, అదే పహారా.. ఢిల్లీలో కొనసాగుతున్న హై అలర్ట్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం 72వ రోజుకు చేరుకుంది. అయితే శనివారం రైతులు పిలుపునిచ్చిన చక్కా జామ్‌ నేపథ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన భారీ భద్రత ఆదివారమూ కొనసాగుతోంది

heavy police deployment at delhi borders over farmers protest ksp
Author
New Delhi, First Published Feb 7, 2021, 2:49 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం 72వ రోజుకు చేరుకుంది. అయితే శనివారం రైతులు పిలుపునిచ్చిన చక్కా జామ్‌ నేపథ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన భారీ భద్రత ఆదివారమూ కొనసాగుతోంది.

ఆందోళనలకు కేంద్రంగా ఉన్న సింఘు, టిక్రీ, గాజీపూర్‌ సరిహద్దుల్లో పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. మరోవైపు చట్టాల్ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తమ ఆందోళనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.  

కాగా, శనివారం నిర్వహించిన చక్కా జామ్‌ అక్కడక్కడ ఉద్రిక్తతలు తప్పించి దేశమంతటా ప్రశాంతంగా ముగిసింది. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకూ ఢిల్లీ సరిహద్దులను వీడేదిలేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ ప్రకటించారు.

చట్టాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వానికి అక్టోబరు 2 వరకు డెడ్‌లైన్ విధిస్తున్నట్లు తెలిపారు. తాము రైతులం... సైనికులం అనేది ఇక మీదట తమ ఉద్యమ నినాదంగా ఉంటుందని వెల్లడించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios