గౌహతిపై విరుచుకుపడిన ఇసుక తుఫాను: ఈదురుగాలులతో భారీ వర్షం

ఓ వైపు దేశంలో ఎండలు మండుతున్న సమయంలో బుధవారం అస్సాంలో భారీ వర్షం కురవడంతో అక్కడి ప్రజలు వణికిపోయారు. తీవ్రమైన ఇసుక, దుమ్ము, ధూళితో కూడిన తుఫాను రాజధాని గౌహతితో పాటు నాగోవ్, మోరిగావ్, కమ్రప్ జిల్లాలపై ఇది విరుచుకుపడటంతో ఆస్తినష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది
Heavy cyclonic storm lashes Guwahati
ఓ వైపు దేశంలో ఎండలు మండుతున్న సమయంలో బుధవారం అస్సాంలో భారీ వర్షం కురవడంతో అక్కడి ప్రజలు వణికిపోయారు. తీవ్రమైన ఇసుక, దుమ్ము, ధూళితో కూడిన తుఫాను రాజధాని గౌహతితో పాటు నాగోవ్, మోరిగావ్, కమ్రప్ జిల్లాలపై ఇది విరుచుకుపడటంతో ఆస్తినష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది.

తుఫాను కారణంగా ఇళ్లు, హోర్డింగ్‌లు కూలిపోగా, వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీని కారణంగా కొన్ని గంటల నుంచి గౌహతి నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఈ తుఫానును స్థానికంగా ‘‘బోర్డోసిలా’’ అని పిలుస్తారు. ఇది ప్రతి ఏడాది వసంతకాలంలో రాష్ట్రాన్ని తాకుతుంది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన ఈ భారీ వర్షం.. రానున్న వర్షాకాలంలో ప్రారంభానికి సూచికగా అక్కడి వారు భావిస్తారు.

మరోవైపు భారత వాతావారణ శాఖ దేశంలోని కోట్లాది మంది రైతులకు శుభవార్తను అందించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని బుధవారం ప్రకటించింది. జూన్ నెలలో సరైన సమయంలోనే నైరుతి రుతుపవనాలు దేశాన్ని తాకుతాయని తెలిపింది.

కేంద్ర  భూఉపరితల శాస్ర్తాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపిన వివరాల ప్రకారం జూన్‌ 1న  కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించనుండగా, జూన్‌ 4న చెన్నైలో, జూన్‌ 8న హైదారబాద్‌ను తాకనున్నాయి. ఇక జూన్‌ 10న పుణేలో, జూన్‌ 11న ముంబైలో రుతుపవానాలు ప్రవేశిస్తాయి.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios