Heatwave alert: భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాబోయే ఐదు రోజుల పాటు వాయువ్య మరియు మధ్య భారతదేశంలోని రాష్ట్రాల్లో వేడి గాలులు ఉంటాయి, దీని కారణంగా ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఐఎండీ హెచ్చరించింది.   

Heatwave alert: దేశవ్యాప్తంగా గ‌త రెండు రోజులు భానుడు త‌న ఉగ్ర‌రూపం దాల్చాడు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. జనజీవనం స్తంభించింది. మండుతున్న ఎండలు, వేడిమి కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్దలు విలవిలలాడుతున్నారు. ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. మరోవైపు నజఫ్‌గఢ్‌లో 48.8 డిగ్రీల సెల్సియస్‌, రోహ్‌తక్‌లో 48 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశ రాజధానిలో సోమవారం దుమ్ము తుపాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

మరోవైపు, రాజస్థాన్‌లో నేటి గరిష్ట ఉష్ణోగ్రత 48.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. అదే సమయంలో, ఆదివారం జమ్మూలో అత్యంత వేడి రోజు. ఇక్కడ ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వచ్చే ఐదు రోజుల పాటు వాయువ్య, మధ్య భారత రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి ఉంటుందని IMD ఆదివారం తెలిపింది.

మరో ఐదు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో వేడిగాలులు .

వాతావరణ శాఖ ప్రకారం.. మే 16 నుండి తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ మరియు హర్యానాలలో ప్రజలు తీవ్రమైన వేడిగాలులు వీచే అవ‌కాశ‌ముంది. అలాగే.., మే 17 న, జమ్మూ, జార్ఖండ్, విదర్భ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా. మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో వేడి గాలులు వీస్తాయని, దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.

దీని తరువాత, మే 18 న, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో తీవ్రమైన వేడి ఉండే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వేడిగాలులు ప్రభావిత ప్రాంతాలలో జాగ్ర‌త్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.