రానున్న రోజుల్లో కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రజలను కోరారు.
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రజలను కోరారు.
రానున్న రోజుల్లో పలు రాష్ట్రాలు పలు పండుగలను ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకొంటారు. అయితే ఈ పండుగను జరుపుకొనే సమయాల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దేశంలో కరోనా కేసులను తగ్గించినట్టుగా ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో వచ్చే పండుగలను దృష్టిలో ఉంచుకొని అజాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోయినా కరోనా వైరస్ పెద్ద ఎత్తున విజృంభించే అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో ఆయన దేశ ప్రజలతో మాట్లాడారు. ప్రాణాలను ఫణంగా పెట్టి పండుగలు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. కుటుంబసభ్యులతో మీ ఇండ్లలోనే పండుగలను జరుపుకోవాలని ఆయన కోరారు.
