Asianet News TeluguAsianet News Telugu

Rising COVID-19 Cases: దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా.. 24 న కేంద్ర‌ ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి సమీక్ష

Rising COVID-19 Cases: దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం నిపుణుల ప్రధాన బృందంతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు.
 

Health Minister Mansukh Mandaviya to chair review meeting tomorrow as COVID-19 cases in India continue to rise
Author
Hyderabad, First Published Jun 22, 2022, 11:57 PM IST

Rising COVID-19 Cases: భార‌త్ లో మ‌రోసారి క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న ప్రారంభ‌మైంది. రోజురోజుకు దేశ‌వ్యాప్తంగా COVID-19 కేసులు పెరుగుతున్నాయి. దీంతో స‌ర్వత్రా ఆందోళ‌న‌లు వ్యక్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్య‌క్ష‌త‌న శుక్ర‌వారం నిపుణుల కోర్ టీమ్‌తో ఉన్న‌త స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ స‌మీక్షా స‌మావేశానికి AIIMS డైరెక్టర్ డాక్టర్ రాందీప్ గులేరియా, ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, NCDC డైరెక్టర్ సుజీత్ సింగ్, కేంద్ర ఆరోగ్య కార్యదర్శిరాజేష్ భూషణ్, బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రాజేష్ ఎస్ గోఖలే, ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి ఎస్ అపర్ణ తదితరులు హాజరు కానున్నారు.

గత కొన్ని వారాలుగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ప్ర‌ధానంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌లలో 1,000 కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసు పెరుగుదల వెనుక ఒమిక్రాన్‌, సబ్‌ వేరియంట్ల నుంచి ఏదైనా కొత్త వేరియంట్‌, సబ్‌ వేరియంట్‌ రూపాంతరం చెందిందా? అని తెలుసుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

తాజాగా ..గత 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 12,249 కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల సంఖ్య 81,687కి చేరుకుంది. అలాగే.. గడిచిన 24 గంటల్లో 13 మంది వైరస్‌ బారిన పడి మరణించారు. అయితే.. ప్రస్తుతం దేశంలో ఎక్కువ‌గా  BA.2., BA.2.38 కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ కేసుల పెరుగుదల వెనుక ఓమిక్రాన్, దాని వేరియంట్‌లు ప్రధాన కార‌ణమ‌ని ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) నిపుణులు అభిప్రాయ‌పడుతున్నారు. దేశంలో న‌మోద‌వుతున్నకేసుల్లో 85 శాతం BA.2, సంబంధిత వైరస్ నమూనాలు, 33 శాతం కేసుల్లో BA.2.38 నమూనాలు ఉన్న‌ట్టు కనుగొన్నారు. 10 శాతం కంటే తక్కువ శాంపిల్స్‌లో BA.4, BA.5 కనుగొనబడినట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

దేశ‌వ్యాప్తంగా 43 జిల్లాల్లో.. కేరళలో 11, మిజోరంలో ఆరు, మహారాష్ట్రలో ఐదు జిల్లాలతో సహా వీక్లీ  కోవిడ్ ఇన్ఫెక్షన్ రేటు 10 శాతానికి పైగా ఉంది. రాజస్థాన్‌లో ఎనిమిది, ఢిల్లీలో ఐదు, తమిళనాడులో నాలుగు జిల్లాలతో సహా 42 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5 నుండి 10 శాతం వరకు అధికార‌ వర్గాలు తెలిపాయి.
  
అంతకుముందు, జూన్ 13 న, ఆరోగ్య మంత్రి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరోగ్య మంత్రులు మరియు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీనియర్ అధికారులతో సమీక్షించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాక్సినేష‌న్ పురోగతిని చ‌ర్చించారు.

గత వారం గురువారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. COVID-19 ఇంకా ముగియలేదు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. మాస్క్‌లు ధరించడం. భౌతిక దూరాన్ని పాటించ‌డం వంటి COVID- 19 నియామాల‌ను పాటించాలని సూచించారు.  అలాగే..  RT-PCR పరీక్ష, క్లినికల్ మేనేజ్‌మెంట్, టీకా, COVID-19 ప్రోటోకాల్‌ను పాటించాలని, సకాలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 'ఐదు రెట్లు వ్యూహం' అనుసరించాలని భూషణ్ ప్రభుత్వానికి సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios