ఈ ఆలోచన కొంతమందికి నచ్చలేదు. దీంతో జనవరి 21న కొందరు దుండగులు పాఠశాలలో విద్యార్థులు ప్రార్థనలు చేస్తున్న వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వెంటనే, ప్రధానోపాధ్యాయురాలు నిబంధనలను ఉల్లంఘించిందని హిందూ కార్యకర్తలు ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముల్‌బాగల్: కోలార్ జిల్లాలోని ఒక governament schoolలో ముస్లిం విద్యార్థులు namaz చేసుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు Headmistressని సస్పెండ్ చేశారు. శుక్రవారాలు నమాజ్ సమయంలో వారు బైటికి వెళ్లడం వల్ల క్లాసులు మిస్ అవ్వకుండా ఉండాలని, కరోనా బారిన పడకుండా ఉండాలని ఆమె స్కూలు ఆవరణలో నమాజ్ కు అనుమతించినట్లు నివేదించబడింది.
బెంగళూరు-చిత్తూరు హైవేపై ఉన్న బాలే చంగప్ప ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్‌లో ఈ ఘటన జరగ్గా, ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని suspend చేశారు. పాఠశాలలో దాదాపు 400 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 165 మంది విద్యార్ధులు ముస్లిం వర్గానికి చెందినవారు ఉన్నారు.
మూడు కారణాల వల్ల స్కూలు ఆవరణలో శుక్రవారం ప్రార్థనలు చేయడానికి విద్యార్థులను అనుమతించాలని పాఠశాల అధికారులు ఇటీవల నిర్ణయించారు.. ఒకటి, ప్రార్థనల కోసం బయటకు వెళ్లిన విద్యార్థులు పాఠశాలకు తిరిగి రాకపోవడం, అందువల్ల వారు క్లాసులో జరిగే పాఠాలను మిస్సవుతున్నారు. రెండోది వారిని బయటకు వెళ్ళడానికి అనుమతించడం వలన కోవిడ్-19 బారిన పడే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇది ఇతర విద్యార్థులకు సోకే అవకాశం ఉంది. ఇక మూడోది, విద్యార్థులు రద్దీగా ఉండే జాతీయ రహదారిని దాటి సమీపంలోని మసీదుకు చేరుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి..
అయితే, ఈ ఆలోచన కొంతమందికి నచ్చలేదు. దీంతో జనవరి 21న కొందరు దుండగులు పాఠశాలలో విద్యార్థులు ప్రార్థనలు చేస్తున్న వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వెంటనే, ప్రధానోపాధ్యాయురాలు నిబంధనలను ఉల్లంఘించిందని హిందూ కార్యకర్తలు ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రదర్శనలు నిర్వహించడమే కాకుండా, ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని డిప్యూటీ కమిషనర్‌కు వారు రిప్రజెంటేషన్ సమర్పించారు.
విచారణ...
దీని మీద విచారణ జరిపిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (కోలార్) రేవణసిదప్ప మాట్లాడుతూ, పాఠశాలలో ప్రార్థనలు చేయడానికి విద్యార్థులను అనుమతించడం లేదని ప్రధానోపాధ్యాయురాలు మొదట చెప్పిందని, అయితే నేషనల్ హైవేని దాటి ప్రమాదాల బారిన పడకుండా నిరోధించడానికే అనుమతించానని తన చర్యను సమర్థించుకుందని చెప్పారు.
ఇక శుక్రవారాలు నమాజ్ కోసం మసీదుకు వెళ్లడానికి వెళ్లిన వారిలో చాలా మంది మధ్యాహ్నం బడికి రావడం లేదు. దీని మీద ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ, ముల్బాగల్‌లో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులతో ఇలా క్యాంపస్ నుండి బయటకు వచ్చేవారికి వ్యాధి సోకుతుందని తెలిపింది. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులు పాఠశాలలో నమాజ్ చేశారని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (ముల్‌బాగల్) గిరిజేశ్వరి దేవి తెలిపారు.
ప్రధానోపాధ్యాయురాలు తాను కేవలం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే పనిచేస్తున్నానని, వారిలో కొంత మందిని ప్రార్థనలు చేసేందుకు అనుమతించడంలో ఎలాంటి దురుద్దేశం లేదని బీఈవోకు తెలిపారు.అయితే ఆమెపై ప్రస్తుతానికి సస్పెన్షన్ వేటు పడింది.
