HDFC Bank:  తమిళనాడు చెన్నైలోని టి.నగర్​ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాదారుల అకౌంట్లో కోట్లాది రూపాయల న‌గ‌దు డిపాజిట్  అయ్యింది. ఇంత పెద్ద మెుత్తంలో ఖాతాల్లో డబ్బులు పడటంతో.. ఖాతాదారులు షాక్ కు గురయ్యారు. తమ ఖాతాలకు రూ.13 కోట్ల మేర నగదు జమ అయినట్టు మెసేజ్స్ రావడంతో అవాక్కయ్యారు. 

HDFC Bank: అనుకోకుండా.. మీ బ్యాంక్ అకౌంట్లో.. ఒక్కసారిగా ఓ ల‌క్ష రూపాయాలు వ‌చ్చి ప‌డితే.. ఎలా ఉంటుంది? అదే ప‌ది ల‌క్షల రూపాయాలైతే.. ఆ సంద‌ర్భంలో ఆశ్చ‌ర్యానికి, సంతోషానికి అవ‌ధులుండ‌లుగా.. అకౌంట్లో అంతా మొత్తం చూస్తే.. తప్పకుండా షాక్ అవుతారు కదా. తాజాగా అలాంటి అవాక్కైయ్యే ఘ‌ట‌న‌నే.. హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా దారుల‌కు జ‌రిగింది. వారి ఖాతాల్లోకి వేలు..ల‌క్ష‌లు కాదు.. ఏకంగా కోట్ల రూపాయాలు వచ్చి అకౌంట్లో ప‌డ్డాయి.

చెన్నైలో ఓ వందమంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(HDFC Bank) వినియోగదారుల‌కు అదృష్టం వ‌రించింది. ఏకంగా వారి ఖాతాలకు రూ13 కోట్ల చొప్పున డ‌బ్బు డిపాజిట్ అయ్యింది. వీరితో పాటు మరి కొందరికి రూ. లక్షల న‌గ‌దు వ‌చ్చి చేరింది. ఈ స‌మాచారం వారికి ఎస్ ఎంఎస్ రూపంలో అంద‌టంతో కొందరు బ్యాంకులకు పరుగులు తీశారు. ఎంటీఎంల్లో క్యూలు క‌ట్టారు.

వివరాల్లోకెళ్తే.. 100 మంది హెడ్​ఎఫ్​సీ బ్యాంకు (HDFC Bank) ఖాతాదారులు కోటీశ్వరులు అయ్యారు. తమ మొబైల్​ ఫోన్లకు వచ్చిన మెసేజ్​లు చూసి షాక్ అయ్యారు. రూ.13 కోట్లు జమ కావడంతో అవాక్కయ్యారు. సాంకేతిక కారణాలతో కోట్లాది రూపాయలు డిపాజిట్ కావడం గమనార్హం. విస్మ‌యానికి గురి చేసే.. ఈ ఘటన చెన్నైలోని త్యాగరాయ నగర్ హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంకులో జరిగింది. తమ తప్పిందని గ్రహించిన బ్యాంకు అధికారులు.. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. సరిదిద్దు బాటు చ‌ర్య‌లు చేపట్టారు. ఆ నగదును వెనక్కి తీసుకున్నారు.సాప్ట్ వేర్ లోపం ఇలా జరిగినట్టు తెలిపారు. ఒకేసారిగా అకౌంట్లో 13 కోట్ల రూపాయాలు జమ అయినట్లు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లు రావడంతో కస్టమర్లు అవాక్కయ్యారు.

ఈ 100 మందే కాకుండా మరి కొంత మంది(HDFC Bank) ఖాతాలకు రూ.10,000, రూ.50,000, రూ.లక్ష నగదు డిపాజిట్ అయ్యిన‌ట్టు అధికారులు గుర్తించారు. తమ అకౌంట్లో ఇంత‌ సొమ్ము ఎలా వచ్చిందో తెలియక షాకయ్యారు. మ‌రికొంత మంది.. ఇది నిజమేనా? కాదో ? తెలుసుకోవ‌డానికి కొందరు బ్యాంకుకు వెళ్తే, ఇంకొందరు ఏటీఎం ల బాట ప‌ట్టారు. ఇలా త‌మ అకౌంట్లో కోట్లాది రూపాయాల‌ బ్యాలెన్స్ చూసుకుని ఆనందంతో 
మురిసిపోయారు. 

కాగా, టి.నగర్‌ (HDFC Bank) బ్యాంక్‌లో ఇటీవల సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయ‌డం వల్ల వందమంది ఖాతాల్లో తలా రూ.13 కోట్ల, మరి కొందరికి రూ10 వేల నుంచి రూ.లక్ష వరకూ జమ అయ్యింది. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 100 ఖాతాలను ఫ్రీజ్ చేశారు. అయినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు డబ్బు డ్రా చేయడం గమనార్హం. మరోవైపు ఈ విషయంపై ఫెడరల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

కాగా, ఈ ఘటనపై (HDFC Bank) బ్యాంకు సిబ్బంది తమకు అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. మరీ కూడా హెచ్‌డీఎఫ్‌సీ వినియోగదారులా..? హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ ఉందా? అయితే బ్యాలెన్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి.. మీ అకౌంట్ లో ఏమైనా డబ్బులు పడ్డాయో చూడండి మ‌రీ..!