ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతదేహం హాస్టల్ గదిలో లభ్యమైన ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలకత్తా హైకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. కేసు డైరీని తదుపరి విచారణ తేదీన సమర్పించాలని జస్టిస్ రాజశేఖర్ మంథా పోలీసులను ఆదేశించారు. 

ఐఐటీ ఖరగ్‌పూర్ లో ఫైజాన్ అహ్మద్ అనే విద్యార్థి మృతిపై విచారణ నివేదికను సమర్పించాలని కలకత్తా హైకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది.ఈ కేసులో తదుపరి విచారణ తేదీ నవంబర్ 10న విచారణ అధికారి కూడా కోర్టుకు హాజరుకావాలని కలకత్తా హైకోర్టు పేర్కొంది. కేసు డైరీని తదుపరి విచారణ తేదీన సమర్పించాలని జస్టిస్ రాజశేఖర్ మంథా పోలీసులను ఆదేశించారు. అస్సాంకు చెందిన విద్యార్థి ఫైజాన్ తండ్రి పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. తన కుమారుడి మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసి.. విచారణ చేయించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.

ఫైజాన్ మృతి కేసుకు సంబంధించిన విచారణ నివేదికను సమర్పించాల్సిందిగా పశ్చిమ మేదినీపూర్ పోలీసు సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. దీనిపై విచారణకు సీనియర్ అధికారిని నియమించాలని ఎస్పీని కోర్టు కోరింది.దీనితో పాటు.. పోస్టు మార్టమ్ రిపోర్టుకు కూడా సమర్పించాలని ఆదేశించారు. మృతుడి భద్రపరిచిన శరీర నమూనాలను విసెరా పరీక్ష చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నవంబర్ 10న తదుపరి విచారణ జరుపుతామని, విచారణ అధికారికి సమన్లు ​​పంపారు. తదుపరి విచారణ రోజున విచారణ అధికారి కూడా కోర్టుకు హాజరుకావాలని కలకత్తా హైకోర్టు పేర్కొంది.

వివరాల్లోకెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అక్టోబర్ 14న మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఫయాజ్‌ అహ్మద్‌(23) అనే విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఆ విద్యార్ధి చనిపోయిన రెండు రోజుల తరువాత గుర్తించారు. అప్పటికే అతని మృతదేహం కుళ్లిపోయింది. అతని స్వస్థలం అసోంలోని టిన్‌సుకియా.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అహ్మద్ ఇంటి నుంచి క్యాంపస్‌కు తిరిగొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ అసోం సీఎం హిమంత బిస్వా శర్మ అక్టోబర్ 20న బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. రాష్ట్రంలోని తిన్‌సుకియా జిల్లాకు చెందిన ఫైజాన్ ఏ పరిస్థితుల్లో మరణించాడనే దానిపై సమగ్ర విచారణ జరగాలని ఆయన అన్నారు.