Asianet News TeluguAsianet News Telugu

మమతకు షాక్: రూ. 5 లక్షల ఫైన్ విధించిన కోల్‌కత్తా హైకోర్టు

 పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీకి  ఆ రాష్ట్ర హైకోర్టు రూ. 5 లక్షల జరిమానాను విధించింది.  నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్ధి సువేంధు అధికారి విజయంపై ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

HC judge imposes Rs 5 lakh fine on Mamata, recuses self from hearing Nandigram case against Suvendu lns
Author
Kolkata, First Published Jul 7, 2021, 11:55 AM IST

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీకి  ఆ రాష్ట్ర హైకోర్టు రూ. 5 లక్షల జరిమానాను విధించింది.  నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్ధి సువేంధు అధికారి విజయంపై ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ కౌశిక్ చందా ను విచారణ నుండి తప్పించాలని ఆమె కోరారు. 

జస్టిస్ చందాను బీజేపీ నేతలతో తరచూ చూశానని అందుకే ఈ పిటిషన్ పై విచారణను చందా నుండి  మరొకరికి బదిలీ చేయాలని మమత బెనర్జీ న్యాయవాది కోర్టును కోరారు.కోల్‌కత్తా హైకోర్టు జస్టిస్ కౌశిక్ చందా  ఈ కేసు విచారణ నుండి తప్పుకొన్నారు. అదే సమయంలో పిటిషనర్ కు రూ. 5 లక్షల జరిమానాను విధించారు.

కేసు విచారణకు ముందే తన నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి ఉద్దేశపూర్వకంగా సంపూర్ణ ప్రయత్నం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక కేసు కోసం రాజకీయ పార్టీతో సంబంధం ఉందని న్యాయమూర్తికి ఆపాదించడం సరికాదని ఆయన చెప్పారు. జస్టిస్ చందా కోల్‌కత్తా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు అదనపు సోలిసిటర్  గా పనిచేశారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios