తాను హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ థాక్రే మనవడినని, మహారాష్ట్ర గౌరవానికి, శివసేన, థాక్రే కుటుంబానికి మచ్చ తెచ్చే ఏ పని తాను చేయనని ఆదిత్య థాక్రే వ్యాఖ్యానించారు.

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసు రోజు రోజుకీ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఆయన మరణానికి సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. కాగా.. ఇప్పటి వరకు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాగా.. తాజాగా.. సుశాంత్ కేసు విషయమై.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రే స్పందించారు. సుశాంత్ సింగ్ ‌రాజ్‌పుత్ కేసులో నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సినీ పరిశ్రమలో ఉన్నవారితో తనకు పరిచయాలున్నాయని, అదేం నేరం కాదని ఆదిత్య చెప్పుకొచ్చారు.

తాను హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ థాక్రే మనవడినని, మహారాష్ట్ర గౌరవానికి, శివసేన, థాక్రే కుటుంబానికి మచ్చ తెచ్చే ఏ పని తాను చేయనని ఆదిత్య థాక్రే వ్యాఖ్యానించారు. సుశాంత్ చనిపోవడానికి, తనకూ ఎటువంటి సంబంధం లేదని, శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

కాగా.. ఇటీవల కంగనా రనౌత్ సుశాంత్ మరణం విషయంలో కొన్ని కామెంట్స్ చేశారు. సుశాంత్ చనిపోవడానికి ముందు రోజు రాత్రి అతని ఇంట్లో పార్టీ జరిగిందని.. ఆ పార్టీకి ఓ సీఎం కుమారుడు హాజరయ్యాడని.. అతనిని అందరూ ముద్దుగా బేబీ పెంగ్విన్ అని పిలుస్తారంటూ కామెంట్స్ చేసింది. అయితే.. ఆదిత్య థాక్రేని ఆమె బేబి పెంగ్విన్ అని సంభోధించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆదిత్య థాక్రే ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. మరి దీనిపై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.