అయోధ్య: 30 ఏళ్ల క్రితం చేసిన సంకల్పం ఇవాళ సాకారం కావవడం ఆనందంగా ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ చేసిన తర్వాత ఆయన ప్రసంగించారు.రామ మందిర నిర్మాణం కోసం ఎందరో బలిదానం చేశారని ఆయన గుర్తు చేసుకొన్నారు.  మా సంకల్పం నెరవేరిందన్నారు. 

రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీ పాత్రను మరవలేమన్నారు. ఆయన ఇక్కడ లేకపోవచ్చు...ఈ కార్యక్రమాన్ని ఆయన టీవీల ద్వారా వీక్షిస్తుంటాడని ఆయన చెప్పారు.

also read:500 ఏళ్ల పాటు జరిగిన సంఘర్షణ ఫలితమే రామ మందిర నిర్మాణం: యోగి ఆదిత్యనాథ్

భవ్య మందిర నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అయ్యేందుకు ఇది ఆత్మ విశ్వాసం నింపుతోందని భగవత్ అభిప్రాయపడ్డారు.
కరోనాతో రామాలయం కోసం పాటుపడడిన ప్రముఖులు రాలేకపోయారన్నారు. 

కరోనా నేపథ్యంలో ఎంపిక చేసిన అతిథుల సమక్షంలో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. 29 ఏళ్ల తర్వాత మోడీ అయోధ్యలో అడుగుపెట్టారు. రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.గత ఏడాది సుప్రీంకోర్టు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ భూమి పూజను నిర్వహించారు.