అయోధ్య:రాముడి ఆలయం కోసం 500 ఏళ్ల పాటు జరిగిన సంఘర్షణ ఫలితమే ఇవాళ మందిర నిర్మాణానికి భూమి పూజ అని  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు.

అయోధ్యలో బుధవారం నాడు రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ చేసిన తర్వాత ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు.ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతతంగా ఈ కల సాకారమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

రామమందిర నిర్మాణం కోసం ఎందరో త్యాగం చేశారని, ఆ త్యాగ ఫలితమే ఇవాళ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిందన్నారు. రామ మందిర భూమి పూజలో పాల్గొనడంతో తన అదృష్టమన్నారు.ప్రధాని నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని ఆయన ప్రకటించారు.

also read:అయోధ్యను సందర్శిస్తున్న తొలి ప్రధాని మోడీ: యూపీ ప్రభుత్వం

మందిర నిర్మాణమే కాదు, భారత్ ఔన్నత్యాన్ని చాటే సందర్భమిదని ఆయన  అభిప్రాయపడ్డారు. భారత్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పనున్నాయన్నారు. 

కరోనా నేపథ్యంలో ఎంపిక చేసిన అతిథుల సమక్షంలో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. 29 ఏళ్ల తర్వాత మోడీ అయోధ్యలో అడుగుపెట్టారు. రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.గత ఏడాది సుప్రీంకోర్టు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ భూమి పూజను నిర్వహించారు.