న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల్లో బ్లాక్ అంటే ఏమిటనే దానిపై తాను నెలల తరబడి రైతు సంఘాల నాయకులను అడుగుతున్నానని.. వాటి గురించి చెబితే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తానని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. 

ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందుకు, విమర్శించినందుకు నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

రాజ్యసభలో శుక్రవారం నాడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రసంగించారు.

తాము మద్దతు ధరలను రైతులకు అందించే లక్ష్యంతో సంస్కరణలను తీసుకొచ్చామన్నారు. ఉత్పత్తి ఖర్చు కంటే 50 శాతం అధికంగా ఎంఎస్‌పీ ఉంటుందన్నారు. లక్ష కోట్ల వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధి ఇచ్చినట్టుగా చెప్పారు. అవసరమైన పెట్టుబడి వ్యవసాయ రంగానికి చేరేలా ప్రయత్నించామని ఆయన వివరించారు.

రైతుల సంక్షేమం కోసమే వ్యవసాయ సంస్కరణలను అమలు చేశామన్నారు.ప్రజాస్వామ్యానికి పౌరులే బలమని ఆయన చెప్పారు. రైతుల గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రైతుల అభ్యున్నతి కోసం తాము కృషి చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న పేద అనుకూల పథకాలు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు.రైతుల సంక్షేమం కోసమే వ్యవసాయ సంస్కరణలు తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు. 

ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారని ఆయన కొనియాడారు. 2000 ఏడాది కష్టతరమైన ఏడాదిగా ఆయన పేర్కొన్నారు. కరోనా కారణంగా పరిమితుల కారణంగా ఆర్ధిక వ్యవస్థ రోజువారీ జీవితాలు ప్రభావితమయ్యాయన్నారు. దేశం వెలుపల పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు.

గ్రామాలు అభివృద్ది చెందాలనేదే మోడీ అభిలాష అని ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీ సహాయంతో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను పెంచినట్టుగా ఆయన తెలిపారు.

కరోనాను ఎదుర్కోవడంలో భారత్ విజయవంతమైందని ఇప్పుడు అధికారికంగా చెప్పగలమన్నారు. ఇంతకుముందు పీపీఈ కిట్ కూడ తయారు చేయడం కష్టమైంది. కానీ, ఇప్పుడు పీపీఈ కిట్స్ ఇతర దేశాలకు కూడ ఎగుమతి చేస్తున్నామన్నారు. 

5వ, ఆర్ధిక కమిషన్ గ్రామ పంచాయితీలకు రూ. 2.36 లక్షల కోట్లు అందించాలని సిఫారసు చేసిందన్నారు. దీనిని కేబినెట్ అంగీకరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం సురుమా రూ. 43 వేల కోట్ల రూపాయాలు మంజూరు చేసినట్టుగా చెప్పారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న పేద అనుకూల పథకాలు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయన్నారు.