న్యూఢిల్లీ: హత్రాస్ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాందీ శుక్రవారం నాడు న్యూఢిల్లీలోని వాల్మీకి ఆలయం వద్ద ఆందోళనకు దిగారు.

ఇవాళ మధ్యాహ్నం ప్రియాంక గాంధీ  వాల్మీకి ఆలయంలో పూజలు నిర్వహించారు.హత్రాస్ ఘటనలో మృతి చెందిన బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలని వాల్మీకి ఆలయంలో ఆమె ప్రార్ధనలు చేశారు. ఆ తర్వాత ఆమె ఆలయం వద్ద ధర్నాకు దిగారు. ప్రియాంక గాంధీ ఆలయం వద్ద నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హత్రాస్ ఘటనపై దేశమంతా స్పందించాలని ఆయన కోరారు.హత్రాస్ బాధితురాలికి ప్రభుత్వం నుండి సహాయం దక్కలేదన్నారు.బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రియాంకగాంధీ స్పష్టం చేశారు.

హత్రాస్ గ్రామంలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు గురువారం నాడు బయలుదేరారు. అయితే మార్గమధ్యలోనే  పోలీసులు రాహుల్, ప్రియాంకను అరెస్ట్ చేశారు. వారి కాన్వాయ్ ను ముందుకు వెళ్లనివ్వలేదు.

హత్రాస్ బాధితురాలిపై అత్యాచారం జరగలేదని యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్  ప్రకటించారు. మెడకు మీద గాయం కారణంగానే బాధితురాలు మృతి చెందిందని  ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించినట్టుగా గురువారం నాడు ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.