హత్రాస్ కుట్ర కేసు ఆరోపణలతో అరెస్టు అయి జైలు జీవితం గడుపుతున్న కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
హత్రాస్ కుట్ర కేసుకు సంబంధించి 2020 అక్టోబర్‌లో అరెస్టయిన కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ జైలులో ఉన్న నిందితుడు విడుదలైన తరువాత వచ్చే ఆరు వారాల పాటు ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించింది.
సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 12న సుప్రీంకోర్టు విచారణ
తన పాస్‌పోర్టును సరెండర్ చేసి ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని తెలిపింది. దీంతో పాటు మరి కొన్ని షరతులు కూడా విధించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ), దాని విద్యార్థి విభాగం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఐ) వంటి టెర్రర్-ఫండింగ్ సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ కప్పన్ బెయిల్ పిటిషన్‌ను యూపీ ప్రభుత్వం ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకించింది. కేరళకు చెందిన జర్నలిస్ట్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని గత నెలలో సుప్రీం కోర్టు అభిప్రాయం కోరింది.
పరీక్ష సమయాల్లో ఇంటర్ నెట్ సేవలపై నిషేధం.. ప్రభుత్వానికి 'సుప్రీం' ఆదేశాలు.. గడువులోగా వివరణ
2020 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు వెళుతుండగా కప్పన్ ను అరెస్టు చేశారు. హత్రాస్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారని పోలీసులు గతంలో పేర్కొన్నారు. అయితే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంబంధాలున్న నలుగురిపై ఇండియన్ పీనల్ కోడ్ యూఏపీఏలోని వివిధ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ దాఖలు అయ్యింది. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు నిధులు సమకూర్చినట్లు పీఎఫ్‌ఐ గతంలో ఆరోపణలు ఎదుర్కొంది.
సోనాలిఫోగట్ మృతి కేసు: గోవాలోని కర్లీ రెస్టారెంట్ కూల్చివేతపై సుప్రీంకోర్టు స్టే
హత్రాస్ లో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే ఆమె కుటుంబ అనుమతి లేకుండానే మృతదేహానికి యూపీ పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కాగా బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో సిద్ధిక్ కప్పన్ ను అరెస్టు చేశారు. పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
