రెండు వారాల క్రితం హర్యానాలో కనిపించకుండా పోయిన ఓ గాయని విగతజీవిగా కనిపించింది. ఆమెతో పనిచేసిన రవి, రోహిత్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

న్యూఢిల్లీ : దాదాపు రెండు వారాలుగా కనిపించకుండా పోయిన Haryanvi Singer మృతదేహాన్ని సోమవారం హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్ జిల్లాలోని హైవే సమీపంలో పాతిపెట్టిన స్థితిలో కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో నివసిస్తున్న ఈ సింగర్ చివరిసారిగా మే 11న ఆమె family membersకు చివరిసారిగా కనిపించింది. ఆమె కనిపించకుండా పోయిన మూడు రోజుల తర్వాత వారు కిడ్నాప్ కేసు పెట్టారు. ఆమెతో పాటు పనిచేసిన రవి, రోహిత్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను Kidnap చేసి Murder చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం మృతురాలు భివానీకి రోహిత్‌తో కలిసి వెళ్లింది. రోహ్‌తక్‌లోని మెహమ్‌కు సమీపంలో ఉన్న ఒక హోటల్‌లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో కనిపించిన దృశ్యాల ప్రకారం వారు అక్కడ డిన్నర్ చేస్తున్నారు. ఈ కేసును పోలీసులు కావాలని సాగదీస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాడీ దొరికినప్పుడు "ఆమె ఒంటిమీద లోదుస్తులు తప్ప వేరే బట్టలు లేవు" అని వారు చెప్పారు.

హర్యానాలోని మెహమ్‌లోని పోలీసులు మాట్లాడుతూ, భైరోన్ భైని గ్రామం వద్ద ఫ్లైఓవర్ సమీపంలో ఓ మృతదేహం పాతిపెట్టినట్లు గుర్తించామని ఒక రోజు క్రితం తమకు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే తాము అక్కడికి చేరుకున్నామని.. ఆ మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష కోసం పంపామని తెలిపారు. ఆ తర్వాత అది కనిపించకుండా పోయిన సింగర్ దిగా గుర్తించామని తెలిపారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. 

ఇదిలా ఉండగా, మార్చిలో తమిళనాడులో ఓ ఇంటర్ విద్యార్థి మిస్సింగ్ కేసు ఇలాంటి కీలకమలుపే తిరిగింది. Intermediate చదువుతున్న విద్యార్థితో ఓ lecturer పరారై వివాహం చేసుకున్న ఘటన tamilnaduలోని తిరుచ్చిలో జరిగింది. వివరాల్లోకి వెళితే… తమిళనాడులోని తురైయూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కంగారుపడిన యువకుడి తల్లిదండ్రులు కుమారుడి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపగా... ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలు పోలీసులనూ ముక్కుమీద వేలేసుకునేలా చేశాయి. 

విద్యార్థిలాగే అదే కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ 26 ఏళ్ల షర్మిల కూడా అదృశ్యం కావడాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. షర్మిల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకున్నారు. షర్మిల ఆ బాలుడిని ప్రేమించి, తీసుకెళ్లి, పెళ్లి చేసుకుందని తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.