అమ్మాయిల పేరిట సోషల్ మీడియాలో పరిచయం చేసుకోవడం.. ఆ తర్వాత వారితో ప్రేమ నటించి.. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడటం లాంటివి చేసేవారు. ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి బ్లాక్ మొయిల్ చేసి డబ్బులు గుంజేవారు. అలా దాదాపు రూ.10కోట్ల వరకు సంపాదించారు.
అమాయకులను టార్గెట్ చేసుకొని.. వారిని మోసం చేసి డబ్బులు గుంజేవారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. తాజాగా.. ఇలాంటి నేరమే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు.. అమాయక యువకులను నగ్న వీడియోలను చిత్రీకరించి.. వాటి ద్వారా బ్లాక్ మొయిల్ చేసి దాదాపు రూ.10కోట్లు కాజేశారు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకోగా.. నిందితులను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... హర్యానాలోని మేవత్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు షంషీర్(36), షఫీ మహమ్మద్(27)లు అమ్మాయిల పేరిట సోషల్ మీడియాలో పరిచయం చేసుకోవడం.. ఆ తర్వాత వారితో ప్రేమ నటించి.. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడటం లాంటివి చేసేవారు. ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి బ్లాక్ మొయిల్ చేసి డబ్బులు గుంజేవారు. అలా దాదాపు రూ.10కోట్ల వరకు సంపాదించారు.
కాగా.. నిందితులు ఇలా చాలా మందిని మోసం చేసినా.. వేరే కేసులో పోలీసులకు చిక్కి.. వీరి అసలు వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం. నిందితులు తమను తాము ఆర్మీ అధికారులుగా చెప్పుకుంటూ.. గజియాబాద్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటి అద్దె చెల్లించకుండా తెలివిగా.. ఇంటి ఓనర్ దగ్గరి నుంచే క్యూఆర్ కోడ్ సహాయంతో రూ.లక్ష కాజేశారు. ఈ కేసులో బాధితుడు.. సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. నిందితులు అసలు నేరాలు బయటపడ్డాయి.
నిందితులు సోషల్ మీడియాలో అమ్మాయిల పేరుతో ఫేక్ ఎకౌంట్స్ క్రియేట్ చేసి.. అబ్బాయిలతో రొమాంటిక్ చాట్ చేసి ఆ తర్వాత వాటితోనే వారిని బెదిరించడం లాంటివి చేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితులతో పాటు.. మరో వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. మూడో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతనిని కూడా అరెస్టు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.
