అల్లర్లతో అట్టుడుకిపోతున్న హర్యానాలో మరో రెండు మసీదులకు దుండుగులు నిప్పుపెట్టారు. అయితే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. బుధవారం రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఎవరికీ గాయాలు కాలేదు.

హర్యానాలోని నుహ్ జిల్లాలో మరో రెండు మసీదులకు నిప్పు అంటుకున్నాయి. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటనల్లో జరిగింది. ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసు అధికారులు తెలిపారు. మసీదుల్లో ఒకటి విజయ్ చౌక్ సమీపంలో ఉండగా, మరొకటి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంది. రెండు మసీదులకు కొంత నష్టం వాటిల్లింది.

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సీమా హైదర్ ? ‘ఎ టైలర్ మర్డర్ స్టోరీ’కి ఆడిషన్స్ ఇచ్చిన పాకిస్థాన్ మహిళ

ఈ ఘటనలపై సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ రెండు మసీదులపై దుండగులు మోలోటోవ్ కాక్టెయిల్స్ విసిరారని పోలీసులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’తో తెలిపారు.

కోర్టు కేసు సెటిల్ మెంట్ కు అంగీకరించలేదలని మహిళపై దాడి.. బట్టలు చింపేసి మరీ దారుణం.. వీడియో వైరల్

ఈ ఘటనలపై నుహ్ పోలీసు సూపరింటెండెంట్ వరుణ్ సింగ్లా మాట్లాడుతూ.. ఒక మసీదులో తేలికపాటి అగ్నిప్రమాదం జరిగిందని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. ఇదిలావుండగా, నుహ్ లో గురువారం కర్ఫ్యూను సడలించారు. ప్రజలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసరాలు కొనుగోలు చేయవచ్చని నుహ్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వర్ తెలిపారు.

బ్యూటీ పార్లర్ లో యువతికి చేదు అనుభవం.. నూనె పెట్టగానే రాలిపోయిన మొత్తం జుట్టు.. అబిడ్స్‌లో ఘటన

విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు ఓ గుంపు ప్రయత్నించడంతో సోమవారం మతఘర్షణలు చెలరేగడంతో నుహ్ లో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే నుహ్ లో మొదలైన మతఘర్షణలు మంగళవారం పొరుగున ఉన్న గురుగ్రామ్ కు విస్తరించాయి. దీంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి. కాగా.. హర్యానాలో చెలరేగిన హింసలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారని, 116 మందిని అరెస్టు చేశామని, 90 మందిని అదుపులోకి తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది.