ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. బిజెపి అధికారంలో వున్న మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ఘోర  పరాభవంతో నిరుత్సాహపడిపోయిన బిజెపి శ్రేణులకు హర్యానా మున్సిపల్ ఎన్నికలు నూతన ఉత్తేజాన్ని నింపాయి. హర్యానా రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని మున్సిపాలిటీలపై బిజెపి జెండా ఎగిరింది. 

గత ఆదివారం హర్యానాలో మున్సిపల్ ఎన్నికలు జరగ్గా ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎన్నికలు జరిగిన 5 మున్సిపాల్ కార్పోరేషన్లు, 2 మన్సిపల్  కమిటీల్లో బిజెపి ఘన విజయం సాధించింది. మూడు రాష్ట్రాల్లో బిజెపిని ఓడించి మంచి ఉత్సాహంతో వున్న కాంగ్రెస్ శ్రేణులకుమ ఈ ఫలితాలు నిరాశపర్చాయి. 

హర్యానాలోని  రోహ్‌తక్, కర్నల్, హిసార్, పానిపట్, యమునానగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో బిజెపి జెండా ఎగిరింది. అన్నిట్లోనూ బిజెపి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చి క్లీన్ స్వీప్ చేసింది.  

ఈ విజయంతో హర్యానాలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తమ పరిపాలనను మెచ్చి రాష్ట్ర ప్రజలు ఈ భారీ విజయాన్ని అందిచారని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. తమ పక్షాన నిలిచి అసాధారణ విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.