Asianet News TeluguAsianet News Telugu

హర్యానా ఐఎన్ఎల్‌డీ పార్టీ చీఫ్ రాఠి దారుణ హత్య.. నడిరోడ్డుపై బహిరంగంగా కాల్పులు జరిపి..!

హర్యానా ఐఎన్ఎల్‌డీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠిని కొందరు దుండగులు చంపేశారు. కారులో వెళ్లుతుండగా.. మరో కారులో వచ్చిన దుండగులు కాల్చిపారిపోయారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే రాఠితోపాటు మరొకరు స్పాట్‌లోనే మరణించారు.
 

Haryana INLD chief nafe singh rathi shot dead in his car by unknown gunmen kms
Author
First Published Feb 26, 2024, 5:50 AM IST

హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ రాజకీయ పార్టీ అధ్యక్షుడు నఫే సింగ్ రాఠి దారుణ హత్యకు గురయ్యారు. మరో ముగ్గురితో కలిసి ఆయన కారులో వెళ్లుతుండగా బహిరంగంగానే కొందరు వారిపై కాల్పులు జరిపి పారిపోయారు. వారిని సమీప హాస్పిటల్ తరలించగా.. అప్పటికే మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠి మరణించినట్టు వైద్యులు తెలిపారు. మరొకరు స్పాట్‌లోనే మరణించారు. ఇంకో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది.

రాఠి మరికొందరితో కారులో వెళ్లుతుండగా జాజ్జర్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రాఠి ఎస్‌యూవీలో ఉండగా.. అక్కడికి మరో కారు వచ్చింది. అందులో నుంచి కొందరు దుండగులు తుపాకులు తీసి ఆ ఎస్‌యూవీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హర్యానా ఐఎన్ఎల్డీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠి హతమయ్యారు. ఆయనతోపాటే ఉన్న మరో వ్యక్తి మరణించారు. ఇంకో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.

Haryana INLD chief nafe singh rathi shot dead in his car by unknown gunmen kms

గాయపడిన వారిని వెంటనే సమీపంలోని బ్రహ్మ శక్తి సంజీవని హాస్పిటల్ తరలించారు. కానీ, అప్పటికే మాజీ ఎమ్మెల్యే మరణించినట్టు వైద్యులు తెలిపినట్టు ఐఎన్ఎల్డీ మీడియా సెల్ హెడ్ రాకేశ్ సిహాగ్ వెల్లడించారు. 

Also Read: LS Polls: కాంగ్రెస్, బీజేపీ హుషారు.. ఉలుకులేని బీఆర్ఎస్!

పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే స్పాట్‌కు వచ్చి ఆధారాలను సేకరించడంలో మునిగారు. సీసీటీవీల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఏ ఒక్క దోషిని కూడా విడిచిపెట్టబోమని సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ అన్నారు. ఈ దాడి వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, ఆయన అనుచరులకు సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios