ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్..
హరియాణా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కర్నాల్ శాసన సభ స్థానానికి రాజీనామా సమర్పించారు. బీజేపీ తనకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పని చేస్తానని అన్నారు.
హరియాణాలో రాజకీయా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్.. తాజాగా తన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కర్నాల్ నియోజకవర్గం నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రామేశ్వరం కేఫ్ పేలుడు.. ప్రధాన నిందితుడి సహచరుడు అరెస్ట్..
2014లో కర్నాల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం పదవిని చేపట్టారు. 2019లో కూడా అక్కడి నుంచే రెండో సారి ఎన్నికయ్యారు. తాజాగా ఆ స్థానానికి రాజీనామా సమర్పించారు. బీజేపీ తనకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో చేస్తానని చెప్పారు. అయితే కర్నాల్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ ఖట్టర్ ను బరిలోకి దింపవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అమెరికాలో జెట్ స్కీ ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి..
ఖట్టర్, ఆయన కేబినెట్ లోని 13 మంది మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. హర్యానా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీని కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నియమించింది. ఈ చర్య దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో బీజేపీ పొత్తుకు ముగింపు పలికింది. 2019లో బీజేపీ, జేజేపీలు ఎన్నికల అనంతర కూటమిగా ఏర్పడి 40 స్థానాలు గెలుచుకుంది. జేజేపీ 10 సీట్లు గెలుచుకుంది.
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ హత్య.. భర్తపై అనుమానం..
కాగా.. హర్యానా అసెంబ్లీలో జరిగిన విశ్వాస తీర్మానాన్ని సైనీ ప్రభుత్వం వాయిస్ ఓటింగ్ ద్వారా నెగ్గింది. తీర్మానంపై రెండు గంటల పాటు చర్చ జరిగింది. విశ్వాస పరీక్షకు ముందు 48 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ బండారు దత్తాత్రేయకు అందజేసినట్లు సైనీ తెలిపారు. 90 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఏడుగురు ఇండిపెండెంట్లలో ఆరుగురితో పాటు ఏకైక హర్యానా లోక్హిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు కూడా ప్రకటించారు.