Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ హత్య.. భర్తపై అనుమానం..

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ కు చెందిన ఓ వివాహిత హత్యకు గురయ్యింది. ఆమెను భర్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విక్టోరియాలోని బక్లీలో ఓ చెత్త కుండిలో ఆమె డెడ్ బాడీ లభ్యమైంది.

Hyderabad woman murdered in Australia Suspicion on her husband..ISR
Author
First Published Mar 10, 2024, 4:01 PM IST | Last Updated Mar 10, 2024, 4:01 PM IST

హైదరాబాద్ కు చెందిన శ్వేత మాధగాని అనే వివాహిత ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురయ్యింది. ఆమె మృతదేహం విక్టోరియాలోని బక్లీలో ఓ మారుమూల రోడ్డులోని చెత్తకుండీలో లభ్యమైంది. హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్ కు చెందిన శ్వేత తన భర్త అశోక్ రాజ్, మూడేళ్ల కుమారుడితో కలిసి జీవించేది. కానీ ఆమె ఆకస్మాత్తుగా హత్యకు గురయ్యారు.

Hyderabad woman murdered in Australia Suspicion on her husband..ISR

అయితే శ్వేత మృతదేహం లభ్యం కావడానికి కొద్దిసేపటి ముందే అశోక్ రాజ్, కుమారుడిని తీసుకొని హఠాత్తుగా ఇండియాకు వచ్చాడు. కుమారుడిని తన అత్తగారింట్లో వదిపెట్టాడు. అనంతరం మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఈ పరిణామాల దృష్యా భర్తే శ్వేతను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని విక్టోరియా పోలీసులు అరెస్టు చేశారు. 

Hyderabad woman murdered in Australia Suspicion on her husband..ISR

కాగా.. భార్యను అశోక్ రాజ్ ఇంట్లోనే హత్య చేసి, మృతదేహాన్ని గ్రామీణ ప్రాంతమైన బక్లీలో చెత్తా కుండిలో పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్వేత సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటుందని, తరచూ ఆహారాన్ని పంచిపెట్టేదని ఇరుగుపొరుగు వారు పోలీసులతో తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios