Dalit assaulted: మ‌ద్యం తాగేందుకు నిరాకరించాడని దళిత యువకుడిపై ఇద్ద‌రూ వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అనంత‌రం మూత్రం క‌లిపిన మ‌ద్యం తాగించారు. ఈ ఘ‌ట‌న హరియాణా రాష్ట్రంలోని రేవారీలో  భైరాంపుర్ భడాగ్ని గ్రామంలోజరిగింది.  

Dalit assaulted: ఆధునిక సమాజం ఎటు అడుగు వేస్తుందో తెలియడం లేదు. మనుషులందరు ఒక్కటే.. అందరు సమానంగా జీవించాలని కలలుగన్న గాంధీ కల నేడు అది కల్లగా మిగిలిపోయింది. రాతి యుగం నుంచి రాకెట్‌ యుగం దాకా తన విజ్ఞానాన్ని పెంచుకున్నా దళితులు బతుకులు మారడం లేదు. నిత్యం ఎదోక చోట‌.. ఏదో మూలన దళితులు అవమానాలు, చీత్కరింపులకు గుర‌వుతున్నారు. ఎంతోమంది నాయ‌కులు.. ఎన్నో ప్ర‌సంగాలు ఇచ్చినా.. దళితులపై దారుణాలు ఆగడం లేదు. 

తాజాగా హర్యానాలో దారుణం జ‌రిగింది. దళిత యువకుడిపై కొంతమంది అగ్రకులాల యువ‌కుడు అమానవీయంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌ద్యం తాగేందుకు నిరాక‌రించాడ‌ని.. దళిత యువకుడి చేతులు కట్టేసి.. మూత్రం కలిపిన బీరును తాగించేందుకు ప్ర‌యత్నించారు. అనంత‌రం ఆ దళిత యువకుడిని తీవ్రంగా కొట్టి.. అతడి వద్దనున్న డ‌బ్బును లాక్కొని పారిపోయారు. మాన‌వ స‌మాజం సిగ్గు ప‌డాల్సిన ఘ‌ట‌న హర్యానా రేవారీలోని భైరాంపుర్ భడాగ్ని గ్రామంలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...హర్యానా లోని రేవారీలోని భైరాంపుర్ భడాగ్ని గ్రామానికి చెందిన దళిత యువకుడు మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి ప‌ట్ట‌ణానికి వెళ్తున సమయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తుషార్, రోహిత్ లు కలిసి ఏవో మ‌య‌ మాటలు చెప్పి ఆ దళిత యువకుడిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం.. తమతో కలిసి మ‌ద్యం సేవించాల‌ని ద‌ళిత యువ‌కుడిపై ఒత్తిడి చేశారు.

ఈ క్ర‌మంలో ఆయువకుడు నిరాకరించడంతో..అత‌ని చేతులను కట్టేసి.. ఇష్టానూసారంగా.. కొట్టి దాడికి పాల్ప‌డ్డారు. తాగిన మైకంలో విచ‌క్ష‌ణ మ‌రిచి.. బీరులో మూత్రం పోయి.. తాగించారు. దీంతో ఆ యువకుడు వాంతి చేసుకున్నారు. తీవ్రంగా కొట్టి అతడి వద్దనున్న డబ్బులు, మొబైల్ ఫోన్​ను లాక్కొని పారిపోయారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆ యువ‌కుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గ్రామ‌స్థుల స‌హ‌యంతో ఆ యువకుడు బవాల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం.. రేవారీ హాస్పిటల్ కి త‌ర‌లించారు. 

బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మ‌ద్యం తాగడానికి నిరాక‌రించ‌న‌నీ, ఇద్దరు వ్యక్తులు కలిసి త‌న‌ని చేతులు కట్టిస్తే.. విచక్ష‌ణ ర‌హితంగా కొట్టార‌ని బాధిత యువకుడు ఆరోపించాడు. అంత‌టితో ఆగ‌కుండా.. మూత్రం కలిపిన బీరు తాగించారని, ఇష్టానుసారంగా.. త‌న‌పై దాడి చేశారని, తీవ్రంగా కొట్టి అనంత‌రం త‌న వద్ద‌నున్న రూ.10 వేల లాక్కొని పారిపోయార‌ని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.