Chandigarh: చండీగఢ్‌ను పంజాబ్ కు వెంటనే బదిలీ చేయాలంటూ పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వ తీర్మనంపై హర్యానా సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆప్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. మంగళవారం నాడు ఈ అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు.
Manohar Lal Khattar: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ పాలిత పంజాబ్ రాష్ట్రానికి తక్షణమే బదిలీ చేయాలని పంజాబ్ తీర్మానం నేపథ్యంలో రాజకీయ దుమారం రేగుతోంది. పంజాబ్-హర్యానా రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. పంజాబ్ లోని ఆప్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే హర్యానా ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆదివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు రవాణా మంత్రి మూల్ చంద్ శర్మ మీడియాకు వెల్లడించారు.
"ఏప్రిల్ 5న హర్యానా అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌ను పిలవాలని నిర్ణయం తీసుకోబడింది. పంజాబ్ తీర్మానం తీసుకువచ్చిన తర్వాత పిలిపించిన ప్రత్యేక సమావేశంలో అనేక అంశాలు తీసుకోబడతాయి" అని చంద్ శర్మ తెలిపారు. చండీగఢ్ కోసం పంజాబ్ తరలింపునకు వ్యతిరేకంగా హర్యానా ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం తీసుకురావడానికి మరియు సట్లెజ్-యమునా లింక్ (SYL) కాలువతో సహా ఇతర సమస్యలను లేవనెత్తే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా మాట్లాడుతూ, "రెండు రాష్ట్రాలకు (చండీగఢ్‌లో) ఉమ్మడి అసెంబ్లీ భవనంలో హర్యానాకు హక్కు వాటాను పంజాబ్ ఇంకా ఇవ్వలేదు" అని తెలిపారు.
పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-1966లోని నిబంధనల ప్రకారం అసెంబ్లీ భవనంలో 40 శాతం స్థలాన్ని హర్యానాకు కేటాయించగా, ఇప్పటి వరకు కేవలం 27 శాతం స్థలం మాత్రమే దక్కిందని హర్యానా స్పీకర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ఉదయం 9.30 గంటలకు సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్.. పంజాబ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పంజాబ్ తీర్మానంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అక్కడ హిందీ మాట్లాడే ప్రాంతాలను హర్యానాకు బదిలీ చేయాలనలి కోరుతున్నారు. ఆదివారం జింద్ జిల్లా సఫిడాన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం ఖట్టర్.. అన్నయ్య (పంజాబ్) పట్ల ఉన్న గౌరవం తమ్ముడి ప్రయోజనాల గురించి చింతించే వరకు మాత్రమే ఉంటుందని పంజాబ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
1966లో పంజాబ్ విభజన తర్వాత హర్యానా రాష్ట్రం ఏర్పాటైంది. పంజాబ్ మరియు హర్యానా ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ ఉంది. హర్యానాకు దక్కాల్సిన 400 గ్రామాలకు పైగా పంజాబ్ ఇవ్వాలని ఖట్టర్ SYL కాలువ విషయం మరియు హిందీ మాట్లాడే ప్రాంతాల సమస్యను కూడా ప్రస్తావించారు. "పంజాబ్ ప్రజలు తప్పుడు చేతుల్లో చిక్కుకున్నందున వారు జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పాలనుకుంటున్నాను. వారు వారి కార్యకలాపాలను మరియు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు (ఆప్ ప్రభుత్వం) మాట్లాడటం ప్రారంభించిన భాషపై ఒక కన్నేసి ఉంచాలి. హర్యానా, పంజాబ్‌లు మన దేశ ప్రయోజనాలకు సంబంధించినవి కావు" అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతకుముందు కూడా, హర్యానా ముఖ్యమంత్రి పంజాబ్‌లోని AAP నేతృత్వంలోని ప్రభుత్వం మొదట SYL కాలువను నిర్మించాలని మరియు పంజాబ్‌లోని హిందీ మాట్లాడే ప్రాంతాలను హర్యానాకు బదిలీ చేయాలని నొక్కి చెప్పారు. కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ ఉద్యోగులకు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఏప్రిల్ 1న రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసింది.
