ప్రయాాగరాజ్ కుంభమేళాలో ఓ వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి అచ్చం హ్యారీ పోటర్ లా ఉండటంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రయాగరాజ్: జనవరి 13 నుంచి మహా కుంభ్ మేళా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరవుతున్నారు. మహా కుంభ్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రుద్రాక్ష మాలలు అమ్మే మోనాలీసా, ఐఐటీ బాబా, ఎంటెక్ బాబా వంటివారు ఫేమస్ అయ్యారు. తాజాగా మరో వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.

కుంభమేళాలో భోజనం చేస్తున్న ఓ వ్యక్తి అచ్చం హాలీవుడ్ నటుడు డేనియల్ రాడ్‌క్లిఫ్‌ను పోలి ఉంది. డేనియల్ రాడ్‌క్లిఫ్ హ్యారీ పోటర్ సినిమాలో నటించి ఫేమస్ అయ్యాడు. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఆ వ్యక్తి జీన్స్, జాకెట్ ధరించి మహా కుంభ్ ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆ వ్యక్తిని హ్యారీ పోటర్‌తో పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హ్యారీ పోటర్ ఇక్కడ తినడానికి వచ్చాడా? కొందరు సరదాగా ప్రశ్నిస్తున్నారు. మరో యూజర్.. ‘చూడటానికి అతను విదేశీయుడిలా ఉన్నా.. తినే తీరు మాత్రం మనోడిలాగే ఉంది’ అని కామెంట్ పెట్టాడు. ఇంకో యూజర్.. ‘అతను హ్యారీ పోటర్ లా ఉన్నాడు’ అని రాసుకొచ్చాడు.

View post on Instagram