Asianet News TeluguAsianet News Telugu

Haridwar groom: పెళ్లిలో వరుడి తీరుపై ఫ్రెండ్స్ ఫైర్.. 50 లక్షల పరువు నష్టం దావా.. కారణం తెలిస్తే షాకే..!

Haridwar groom: వరుడు తన స్నేహితులను వదిలేసి బారత్‌కు వెళ్లిపోయాడని ఆగ్రహించిన స్నేహితులు వరుడిపై రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశారు. ఈ వింత‌ ఘ‌ట‌న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లా బహదూరాబాద్ గ్రామంలో జ‌రిగింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం నెట్టింట్లో తెగ చక్క‌ర్లు కొటుడుతోంది.
 

Haridwar groom sued by friends for Rs 50 lakh after he 'ditched' them and left with Baarat early
Author
Hyderabad, First Published Jun 27, 2022, 11:13 PM IST

Haridwar groom: ప్రతి ఒక్కరూ త‌మ జీవితంలో ఒక్కసారి జ‌రుపుకునే పెళ్లి వేడుక‌ను చాలా గ్రాండ్ గా.. మరచిపోలేని విధంగా జ‌రుపుకోవాల‌ని క‌లలు కంటారు. అందుకు త‌గిన విధంగా ప్లాన్స్ వేస్తుంటారు. అందుకు త‌గిన‌విధంగా ఎంత ఖర్చైనా.. చేయడానికైనా స‌రే.. అస‌లూ వెనుకడుగు వేయ్యారు. పెళ్లి చూపులు మొద‌లు.. ఎంగేజ్మెంట్, ఫోటో షూట్స్, బ్యాచ్ ల‌ర్ పార్టీలు.. ప్రీ వెడ్డింగ్ షూట్స్.. హల్దీ ఫంక్ష‌న్స్, మెహందీ వేడుక‌లు, సంగీత్, పెళ్లి, బ‌రాత్ ఇలా ప్ర‌తి ఒక్క ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ఫ్లాన్ చేసుకున్నారు. 

కానీ, కొన్నిసార్లు ఈ వేడుకలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ ఘ‌ట‌నే వివాదానికి దారి తీస్తాయి. ఆత్మీయుల‌ను దూరం చేస్తాయి. ఈ కోవ‌కు చెందిన ఓ ఘ‌ట‌నే ఓ పెళ్లికొడుకు ఎదురైంది. వరుడు తామ‌ను వదిలేసి.. బారత్‌కు వెళ్లిపోయాడ‌ని.. ఆగ్రహించిన స్నేహితులు..  అత‌నిని కోర్టు మెట్లెక్కెలా చేశారు. అత‌నిపై రూ. 50 ల‌క్ష‌ల‌ ప‌రువున‌ష్టం దావా వేశారు. వినడానికి ఈ విష‌యం చాలా ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లాలో జరిగింది. ఇప్పుడూ ఈ విష‌యం నెట్టింట్లో తెగ‌ వైరల్ గా మారింది.

వివరాల్లోకెళ్తే..  ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లా బహదూరాబాద్ గ్రామానికి చెందిన రవికి ఇటీవల వివాహం జరిగింది. అయితే..పెళ్లి కార్డులు పంపేందుకు, ఇత‌ర పెళ్లి ప‌నులు చేసిందుకు త‌న‌ స్నేహితుడు చంద్రశేఖర్‌ సహాయం కోరాడు రవి. పెళ్లికి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని చంద్ర‌శేఖ‌ర్ తో షేర్ చేసుకున్నాడు. అవ‌సర‌మైన ప్ర‌తి విష‌యంలో అత‌ని స‌హాయాన్ని తీసుకున్నాడు ర‌వి. వారు ముందుగా అనుకున్న ప్ర‌కారం.. పెళ్లి రోజున సాయంత్రం ఐదు గంటలకు స్నేహితులంద‌రూ క‌లిసి..ఊరేగింపుగా వివాహానికి బయలుదేరాల‌ని ప్లాన్ వేసుకున్నారు.

ఈ మేర‌కు త‌మ స్నేహితులందరికీ  ఇన్విటేషన్లు పంపారు. అలాగే ఆ సమయానికి అందరం కలుసుకుందామని స్నేహితులకు చంద్రశేఖర్‌ చెప్పాడు. పెళ్లి రోజున చంద్ర‌శేఖ‌ర్ త‌న స్నేహితులందరితో కలిసి బ‌రాత్ వెళ్దామ‌ని, ఓ రేంజ్ లో ఎంజాయ్ చేద్దామ‌ని ఫిక్స్ అయ్యాడు. కానీ, పెళ్లి రోజున అత‌ని ప్లాన్ రివ‌ర్స్ అయ్యింది. అనుకున్న విధంగా చంద్రశేఖర్ త‌న స్నేహితులందరితో క‌లిసి వరుడు రవి ఇంటికి చేరుకున్నాడు. కానీ, వ‌రుడు ర‌వి .. త‌న స్నేహితుడు చంద్ర‌శేఖ‌ర్ కు షాక్ ఇచ్చారు. వారు అనుకున్న‌ సమయానికి ముందుగానే పెళ్లి కుమారుడు రవి తన కుటుంబం, బంధువులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు వెళ్లిపోయాడు. ఇది తెలిసిన చంద్రశేఖర్‌.. పట్టరాని కోపంతో వరుడికి ఫోన్‌ చేశాడు. అయితే వారు రావడం ఆలస్యమైందని పెళ్లి కుమారుడు ఆరోపించాడు. పైగా.. పెళ్లికి రావాల్సిన అవ‌స‌రం లేదు.. తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని స్నేహితులతో అన్నాడు.

వ‌రుడు రవి తీరుపై చంద్రశేఖర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న వ‌ల్ల.. త‌న స్నేహితులందరి ముందు త‌న ప‌రువు పోయింద‌ని, మానసికంగా చాలా బాధ‌ప‌డ్డాడు. అంత‌టితో ఆగ‌కుండా.. చంద్ర‌శేఖ‌ర్  వెంటనే త‌న‌ న్యాయవాదిని సంప్రదించాడు. స్నేహితులను వదిలేసి పెళ్లి చేసుకోవడంతోపాటు.. తన‌ గౌరవాన్ని దెబ్బతీసిన వ‌రుడు రవిపై రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశాడు. త‌న పెళ్లి ప‌నుల‌కు వాడుకోని..చివ‌ర‌కు స్నేహితులు, అతిథుల ముందు ప‌రువు పోయేలా తిట్టాడ‌ని, మానసికంగా హింసించినట్లు ఆరోపించాడు. రవికి లీగల్ నోటీసు పంపి మూడు రోజుల్లోగా జరిగిన ఘ‌ట‌న‌పై బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే.. రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios