హ్యాపీ బర్త్ డే ‘గూగుల్’...నెటిజన్ల స్పెషల్ థ్యాంక్స్
గూగుల్ లో దాదాపు 100 భాషలకు సంబంధించిన సమాచారాన్ని మనం పొందగలం. ఓ చిన్న కంపెనీకి ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు మిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. దీనికి ఈ పేరు పెట్టడానికి ఓ కారణం కూడా ఉంది. గూగుల్‌కి ఆ పేరు... googol అనే పదం నుంచీ వచ్చింది.

ప్రస్తుత కాలంలో గూగుల్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచంలో మనం ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా.. గూగుల్ చేస్తాం. సరిగ్గా 21 సంవత్సరాల క్రితం ఇదే రోజు గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్ ని మనకు పరిచయం చేశారు. గూగుల్ ఈ రోజు తన 21వ పుట్టిన రోజు జరుపుకుంటోంది.
ప్రతి సందర్భంగాన్ని గూగుల్.. డూడుల్ తో ప్రత్యేకంగా మనకు చూపిస్తూ ఉంటుంది. అలానే.. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా ఓ డూడుల్ ని ఏర్పాటు చేసింది.ఇందులో... వింటేజ్ కంప్యూటర్ అందులో గూగుల్ బ్రౌజర్ విండోను ఉంచింది.
స్టాండ్‌ఫర్డ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేసిన లారీ పేజ్, సెర్జీ బ్రిన్... వర్శిటీలోని ఓ డార్మ్ రూంలో 1998 సెప్టెంబర్ 27న గూగుల్‌ను స్థాపించారు. నిజానికి సెప్టెంబర్ 7నే గూగుల్ ప్రారంభమైంది. ఐతే... కంపెనీకి... కార్పొరేట్ కంపెనీగా గుర్తింపు లభించింది మాత్రే సెప్టెంబర్ 27న. ఈ గుర్తింపు వేగంగా లభించేందుకు లారీపేజ్, సెర్జీ బ్రిన్ ఆ 20 రోజులూ చాలా కష్టపడ్డారు.
గూగుల్ లో దాదాపు 100 భాషలకు సంబంధించిన సమాచారాన్ని మనం పొందగలం. ఓ చిన్న కంపెనీకి ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు మిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. దీనికి ఈ పేరు పెట్టడానికి ఓ కారణం కూడా ఉంది. గూగుల్‌కి ఆ పేరు... googol అనే పదం నుంచీ వచ్చింది. 1 పక్కన 100 సున్నాలు పెడితే... ఆ సంఖ్యను googol అంటారు. భారీ మొత్తంలో సమాచారం అందిస్తున్నామనే అర్థం వచ్చేలా దీనికి ఈ పేరు పెట్టారు.
గూగుల్ ప్రధాన లక్ష్యం ఒకటే. ప్రపంచంలోని సమాచారం మొత్తాన్నీ ఓ క్రమ పద్ధతిలో పెట్టి... అది అందరికీ చేరేలా చేసి... అందరూ దాని నుంచీ ప్రయోజనం పొందేలా చేయడం. కాగా... గూగుల్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్న నెటిజన్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా దన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు.