Asianet News TeluguAsianet News Telugu

UP Assembly Election 2022: ఎన్నిక‌ల‌పై క‌రోనా ప్ర‌భావం.. ఈసీ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు !

UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. క‌రోనా కేసుల పెరుగుద‌లను దృష్టిలో ఉంచుకుని ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రోడ్‌షో, బైక్ ర్యాలీ, పార్టీ ప్రచార ఊరేగింపుపై నిషేధం విధించించ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 
 

happiness and sadness decision virtual rally digital campaign candidates trying their hands on the internet pitch
Author
Hyderabad, First Published Jan 14, 2022, 12:59 PM IST

UP Assembly Election 2022: త్వ‌రలో జ‌ర‌గ‌బోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. గ‌తేడాది నుంచే రాష్ట్రంలోని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ప్రచారం సాగిస్తున్నాయి. ఇక ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌చార‌హోరు సాగిస్తున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల‌పై (UP Assembly Election) క‌రోనా ప్ర‌భావం ప‌డింద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. క‌రోనా కార‌ణంగా ప‌లు రాజ‌కీయ పార్టీలు బ‌హిరంగ సభ‌లు, భారీ ర్యాలీల‌కు దూరంగా ఉంటున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా కేసుల పెరుగుద‌లను దృష్టిలో ఉంచుకుని ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జనవరి 15 వరకు రోడ్‌షో, బైక్ ర్యాలీ, పార్టీ ప్రచార ఊరేగింపుపై నిషేధం విధించింది. కోవిడ్ 19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని పోలింగ్ కేంద్రాల్లో శానిటైజర్లు, మాస్కులు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, పోలింగ్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచుతున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర వెల్ల‌డించారు. అయితే, ఈసీ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో అన్ని రాజ‌కీయ పార్టీలు డిజిటల్ ప్ర‌చారాల‌పై దృష్టిని సారించాయి. యూపీలో వ‌ర్చువ‌ల్ ర్యాలీలు, డిజిట‌ల్ ప్ర‌చారాలు.. ఈసీ నిర్ణ‌యంపై కొంద‌రు సంతోషం వ్య‌క్తం చేస్తుండ‌గా, వ‌రికొంత మంది నేత‌లు నిరాశ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. 

ఎన్నిక‌లు (UP Assembly Election) జ‌ర‌గ‌బోయే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. గోరఖ్‌పూర్ డివిజన్‌లో గోరఖ్‌పూర్, మహరాజ్‌గంజ్, డియోరియా, కుషినగర్ అనే నాలుగు జిల్లాలు ఉన్నాయి. మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే వ్య‌క్తి ఐదుగురు స‌భ్యుల‌తోనే ఇంటింటి ప్ర‌చారం చేయాల్సి ఉండ‌టం.. డిజిట‌ల్ ప్ర‌చారాల‌పై రెండు ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎన్నిక‌ల  కోసం ఎదురుచూస్తున‌న అభ్య‌ర్థులు.. ఈసీ తీసుకున్న నిర్ణ‌యంతో  గోర‌ఖ్‌పూర్ డివిజ‌న్ లోని వివిధ పార్టీల నాయ‌కుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. 

2012లో గోరఖ్‌పూర్ డివిజన్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా నౌతన్వాన్ విధానసభ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశల్ కిషోర్ సింగ్ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని పూర్తిగా  బీజేపీకి  అనుకూలంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. లైన్ క‌ట్టి ఐదు కేజీల బియ్యం, నూనె తీసుకునే పేద‌లు రోజంతా కష్టపడి పని చేస్తారని, ఆ తర్వాత కూడా కడుపు నిండదని అలాంటి వారికి డిజిట‌ల్ గురించి ఎలా అన్ని విష‌యాలు తెలుస్తాయ‌ని అన్నారు. వర్చువల్ ర్యాలీలో ఎలా పాల్గొంటాడు? ఒకవైపు దేశ ప్రధానమంత్రి ప్రజలకు రెట్టింపు మోతాదులో కరోనా వ్యాక్సిన్‌ వేశారని, ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మరోవైపు ఎన్నికలు వచ్చిన వెంటనే ఆవు పేడ ఏరుకోవడం, ఇంట్లో వంటలు చేయడం వంటి పనుల్లో నిమగ్నమైన ఆ గ్రామంలోని మహిళల వద్ద మొబైల్ ఫోన్ కూడా ఉండదు. త‌ల్లిదండ్రులు వారి పిల్లలను ఆన్‌లైన్ చ‌దువుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేని స్థితిలో చాలా మంది ఉన్నారు అని అన్నారు. అయితే, ఈసీ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఎన్నిక‌ల‌పై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ద‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు బీజేపీ గురించి తెలుస‌నీ, ఈ ఎన్నిక‌ల్లో దానికి గుణ‌పాఠం చెబుతార‌ని అన్నారు. 

2002 నుండి గోరఖ్‌పూర్ నగర అసెంబ్లీ నుండి వరుసగా నాలుగు సార్లు BJP MLA అయిన డా. రాధా మోహన్ దాస్ అగర్వాల్ మాట్లాడుతూ.. 2017 సంవత్సరం నుంచి వర్చువల్ మీటింగ్ నిర్వహిస్తున్నానని తెలిపారు. కరోనా దృష్ట్యా, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి నేను మద్దతు ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. రోజూ రాత్రి 8 గంటలకు నా ఫేస్‌బుక్ పేజీలో పౌరులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాన‌ని తెలిపారు. అలాగే, ప‌నియారా ఎమ్మెల్యే జీఎం సింగ్ మాట్లాడుతూ..  కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల సంఘం వర్చువల్ ర్యాలీ, డిజిటల్ ప్రచారం కొన‌సాగించాల‌ని ఈసీ మంచి నిర్ణ‌యం తీసుకుంద‌ని అన్నారు. తాను మొద‌టి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాన‌నీ, సొంత‌ Facebook పేజీ కూడా ఉంద‌ని దీని ద్వారా ప్ర‌చారం సాగిస్తున్నాన‌ని తెలిపారు.  గోరఖ్‌పూర్ ఆప్ నేత విజయ్ శ్రీవాస్తవ.. ఈసీ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. బీజేపీకి అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు. గోరఖ్‌పూర్ సిటీ నుంచి స‌మాజ్‌వాదీ నుంచి బ‌రిలో నిల‌వ‌బోతున్న నీర‌జ్ షాహి మాట్లాడుతూ.. ఇది కేవలం బీజేపీకి మేలు చేసే నిర్ణయమని అన్నారు. లక్ష ప్రయత్నాలు చేసిన‌ప్ప‌టికీ.. ఈసారి బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios