హనుమంతుడి జాతి గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారాన్ని రేపాయి. ఆయన దళితుడుని యోగి అంటే.. కాదు గిరిజనుడని మరో వర్గం వాదించుకుంటోంది.

తాజాగా ఈ వివాదంలోకి జైనులు వచ్చారు. హనుమంతుడు దళితుడు కాదు..గిరిజనుడు కాడు.. అతడు జైన మతానికి చెందిన వాడు అంటూ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమస్‌గఢ్‌లోని జైన ఆలయ పూజారి ఆచార్య నిర్భయ్ సాగర్ మహరాజ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

జైనుల్లో 169 మంది గొప్ప వ్యక్తుల సమ్మేళనమే హనుమంతుడు.. జైనమతంలో 24 మంది కామదేవులు ఉన్నారు. అందులో హనుమంతుడు ఒకరన్నారు. జైన దర్శన్‌ను అనుసరించి చక్రవర్తి, నారాయణ, ప్రతి నారాయణ, వాసుదేవ, కామదేవులు తీర్థంకరులకు రక్షణగా ఉంటారని పేర్కొన్నారు.

జైన ధర్మంలో హనుమంతుడు తొలి క్షత్రియుడని.. వైరాగ్యం ప్రాప్తించిన మీదట ఆయన అడవుల్లోకి వెళ్లి తపస్సు చేసి హనుమంతుడిగా మారారన్నారు. జైన గ్రంథాల్లో ఈ విషయం స్పష్టంగా రాసి ఉందని.. ఇతరు జైనుల్లాగే హనుమంతుడికి కూడా కులం లేదని పేర్కొన్నారు. 

ఆంజనేయస్వామి దళితుడట.. యోగి సంచలన వ్యాఖ్యలు