ఆకాశంలో హనుమాన్ డ్రోన్.. క్రియేటివిటీకి భక్తులు ఫిదా..!
ఇంకేముంది, దానిని చూస్తుంటే, అచ్చం హనుమంతుడే స్వయంగా ఎగురుకుంటూ వచ్చినట్లుగా ఉంది.ఈ సందడంతా ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ లో చోటుచేసుకుంది.
డ్రోన్.. దీని గురించి ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తెలుసు. ఏదైనా ఈవెంట్ ని ఫుల్ గా కవర్ చేయడానికి ఈ డ్రోన్ కెమేరాలు వాడుతుంటారు. చాలా మంది తమ పర్సనల్ ఫంక్షన్ల దగ్గర నుంచి, రాజకీయ నాయకులు పొలిటికల్ ఈవెంట్స్, సినిమాలు ఇలా ఏదైనా టాప్ నుంచి వ్యూ కనిపించాలి అంటే, ఈ డ్రోన్ ఉండాల్సిందే. అయితే, ఈ డ్రోన్ విషయంలో కొందరు హనుమాన్ భక్తులు తమ క్రియేటివిటీ ప్రదర్శించారు.
మామూలు గా సాధారణ డ్రోన్ కాకుండా, సంజివనీ కోసం ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడి ప్రతిమను తయారు చేశారు. దానికి డ్రోన్స్ కనెక్ట్ చేశారు. ఇంకేముంది, దానిని చూస్తుంటే, అచ్చం హనుమంతుడే స్వయంగా ఎగురుకుంటూ వచ్చినట్లుగా ఉంది.ఈ సందడంతా ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ లో చోటుచేసుకుంది.
అసలు మ్యాటర్ లోకి వెళితే, ఈ నెల 24న దేశవ్యాప్తంగా ప్రజలు దసరా పండగను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే అంబికాపూర్ లోనూ దసరా సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. అయితే, అక్కడ జరిగిన సంబరాలను క్యాప్చర్ చేసేందుకు ఇలా వినూత్నంగా హనుమాన్ ఆకారంలో ఉన్న డ్రోన్ ని ఉపయోగించడం విశేషం. దసరా సందర్భంగా ఆ ప్రాంతంలోని కళాకేంద్ర మైదానం వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. సమీపంలోని మహామాయ ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు అంతా డ్రోన్ తో వీడియో తీశారు. హనుమాన్ డ్రోన్ వాడటం చూసి, స్థానికులు సైతం నివ్వరపోయారు. ఆ డ్రోన్ ఎగురుతుంటే, ప్రజలు జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు.
కాగా, కొందరు ఔత్సాహికులు హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ డ్రోన్‌ను తమ కెమేరాల్లో బంధించారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే హనుమంతుడిని పోలిన డ్రోన్ ఎగురవేయడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోతోపాటు గతంలో పంజాబ్‌లోని లుధియానాలో కూడా హనుమాన్ డ్రోన్లను ఎగురవేశారు. ప్రస్తుతం మాత్రం ఈ హనుమాన్ డ్రోన్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.