జ్ఞానవాపి కాంప్లెక్స్ ను హిందువులకు అప్పగించాలి:వీహెచ్‌పీ నేత అలోక్ కుమార్

జ్ఞానవాపి కాంప్లెక్స్ ను హిందువులకు అప్పగించాలని  వీహెచ్ పీ నేత అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. 

Handover the Gyanvapi Structure to Hindus VHP working president Alok kumar lns

న్యూఢిల్లీ: జ్ఞానవాపి నిర్మాణాన్ని హిందువులకు అప్పగించాలని  విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్  డిమాండ్ చేశారు.ఆలయ ప్రాంగణంలో ఆర్కియాలజీ  సర్వే రిపోర్టు ను జిల్లా న్యాయమూర్తికి అందించింది.ఈ రిపోర్టును  హిందూవులు, ముస్లింలకు కూడ ఇవ్వాలని  కోర్టు ఇటీవలనే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

జ్ఞానవాపి నిర్మాణం నుండి ఎఎస్ఐ సేకరించిన ఆధారాలు అద్భుతమైన ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినట్లు  నిర్ధారిస్తున్నాయని  అలోక్ కుమార్ చెప్పారు.మసీదు పరిధిని విస్తరించాడానికి సహాన్ నిర్మాణంలో  స్థంభాలతో  ముందుగా ఉన్న ఉన్న ఆలయంలోని భాగాలను మార్పులు చేసినట్టుగా ఎఎస్ఐ నివేదిక రుజువు చేస్తుందని అలోక్ కుమార్ చెప్పారు. ఇక్కడ మసీదు లేదని వాజుఖానా అని పిలుచుకొనే  శివలింగం బట్టి స్పష్టమౌతుందని  చెప్పారు.  నిర్మాణంలో లభించిన శాసనాల్లో జనార్థన, రుద్దర,ఉమేశ్వర వంటి పేర్లు కన్పించడం ఇక్కడ ఆలయం ఉందని చెప్పడానికి స్పష్టమైన  నిదర్శమని  అలోక్ కుమార్ చెప్పారు.

also read:జ్ఞానవాపి మసీదు: 'ఇరువర్గాలకు అందుబాటులో ఆర్కియాలజికల్ సర్వే రిపోర్టు'

ప్రార్థనా స్థలం  యొక్క మతపరమైన స్వభావం 1947 ఆగస్టు ఉనికిలో ఉందని ఆయన చెప్పారు. పూజా స్థలాల చట్టం  1991లోని సెక్షన్ 4 ప్రకారం నిర్మాణాన్ని హిందూ దేవాలయంగా ప్రకటించాలన్నారు.

 

వాజుఖానా అని పిలవబడే ప్రాంతంలో కనిపించే  శివలింగానికి పూజ చేయడానికి హిందువులను  అనుమతించాలన్నారు.  జ్ఞానవాపి మసీదును మరొక అనువైన ప్రదేశానికి తరలించుకోవాలని ఆయన ఇంతేజామియా కమిటీని కోరారు.భారతదేశంలోని  రెండు ప్రధాన వర్గాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడానికి ఈ ఉదాత్తమైన చర్య ఒక ముఖ్యమైన అడుగుగా విశ్వహిందూ పరిషత్ భావిస్తుందని  అలోక్ కుమార్ చెప్పారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios