కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘‘న్యూ లుక్’’ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ గాంధీ వారం రోజు పర్యటన నిమిత్తం లండన్‌కు వెళ్లారు. అక్కడ రాహుల్ న్యూ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘‘న్యూ లుక్’’ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ గాంధీ వారం రోజు పర్యటన నిమిత్తం లండన్‌కు వెళ్లారు. అక్కడ రాహుల్ న్యూ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌ 7వ తేదీన భారత్ జోడో యాత్ర చేపట్టిన.. యాత్ర మొత్తం గుబురు గడ్డంతోనే కనిపించారు. అలాగే రాహుల్ తలపై హెయిర్ కూడా పెద్దగానే కనిపించింది. భారత్‌ జోడో యాత్ర ముగిసినప్పటికీ రాహుల్ అదే లుక్‌లో కనిపించారు. పార్లమెంట్ సమావేశాలకు కూడా అలానే హాజరయ్యారు. 

అయితే తాజాగా రాహుల్ గాంధీ.. ఆ లుక్‌కు స్వస్తి పలికారు. భారత్ జోడో యాత్ర తర్వాత మొదటిసారిగా హెయిర్ కట్‌ చేయించి.. గడ్డం ట్రిమ్ చేయించి కనిపించాడు. అలాగే తెల్లటి టీ-షర్టుకు బదులుగా సూట్-టైలో కనిపించారు. ఈ లుక్‌లో రాహుల్ స్టైలిష్‌గా ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. భారత్ జోడో యాత్రకు ముందు రాహుల్ గాంధీ చాలా వరకు క్లీన్ షేవ్‌తోనే కనిపించేవారి.. ఈసారి కొంచెం మీసాలు, గడ్డం ఉంచుకోవడంతో సరికొత్తగా కనిపిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక, రాహుల్ సరికొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Scroll to load tweet…


రాహుల్ తన యూకే పర్యటనలో భాగంగా.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ‘‘లెర్నింగ్ టు లిసన్ ఇన్ ది 21వ శతాబ్దం’’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. ఇందుకోసమే రాహుల్ ఈ మేకోవర్‌లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారతదేశపు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీని మా కేంబ్రిడ్జి ఎంబీఏ ప్రోగ్రామ్‌కు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ ట్వీట్ చేసింది. కేంబ్రిడ్జి జడ్జ్ బిజినెస్‌ స్కూల్‌ విజిటింగ్ ఫెలోగా రాహుల్ ‘లెర్నింగ్‌ టు లిజన్‌ ఇన్‌ ది 21st సెంచరీ’ అనే అంశంపై ప్రసంగం చేయనున్నారని తెలిపింది.