హెచ్3 ఎన్2 వైరస్ కేసులు దేశంలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరో వైపు ఈ వైరస్ కారణంగా ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ:కరోనా మాదిరిగానే హెచ్ 3 ఎన్2 ఇన్ ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.దేశంలో జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. హెచ్ 3 ఎన్2 ఇన్ ఫ్లూయెంజా వైరస్ కారణంగానే జలుబు, దగ్గు, జ్వరానికి గురౌతున్నారని వైద్యులు గుర్తించారు.
హెచ్ 3 ఎన్2 ఇన్ ఫ్లూయెంజా వైరస్ కారణంగా జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు తెలిపారు.హెచ్ 3 ఎన్2 ఇన్ ఫ్లూయెంజా వైరస్ కాలక్రమేణా పరివర్తన చెందుంతుందని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. గతంలో హెచ్1ఎన్1 వైరస్ ప్రభావం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే మాస్కును వాడాలని గులేరియా సూచించారు. చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారికి ఐదు రోజుల పాటు జ్వరం ఉంటుందని ఐఎంఏ తెలిపింది. జ్వరం, జలుబు, దగ్గు ఉందని యాంటీ బయాటిక్ లు తీసుకోకుండా ఉండాలని కూడా ఐఎంఏ సూచించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంటీ బయాటిక్ ల వాడకం ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ గుర్తించింది. యాంటీ బయాటిక్ ల వాడకాన్ని తగ్గించాలని ఐసీఎంఆర్ సూచించింది. వైద్యుల సలహ లేకుండా నేరుగా మెడికల్ దుకాణానికి వెళ్లి మందులు తీసుకొనే పద్దతిని మానుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది.
హెచ్ 3 ఎన్2 ఇన్ ఫ్లూయెంజా వైరస్ ప్రమాదకరం కాదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ కరోనా మాదిరిగానే ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాలు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి.
ఈ కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ పట్ల వృద్దులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ సూచిస్తుంది. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారంతా ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించారు.
