Asianet News TeluguAsianet News Telugu

Gyanvapi Mosque Case : జ్ఞానవాపి సర్వే నివేదిక.. 'శివలింగం', విరిగిన దేవతా విగ్రహాల ఫోటోలు ఏం చెబుతున్నాయి

వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే నివేదిక దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. మసీదు సముదాయంలోని హిందూ దేవతల విగ్రహాలు , ఇతర ఐకానోగ్రఫీ శకలాలు కనిపించేలా వెలుగులోకి వచ్చిన ఫోటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవ్వడం కావడమే కాదు,  వివాదానికి దారితీశాయి.

Gyanvapi survey report photos show shivling, broken deity statues ksp
Author
First Published Jan 26, 2024, 9:32 PM IST

వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే నివేదిక దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. మసీదు సముదాయంలోని హిందూ దేవతల విగ్రహాలు , ఇతర ఐకానోగ్రఫీ శకలాలు కనిపించేలా వెలుగులోకి వచ్చిన ఫోటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవ్వడం కావడమే కాదు,  వివాదానికి దారితీశాయి. హనుమాన్, గణేశుడు, నంది వంటి హిందూ దేవతల విరిగిన విగ్రహాలను చూపించేలా జాతీయ వార్తాసంస్థ " INDIA TODAY " ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఫోటోలలో అనేక యోనిపట్టాలు (శివలింగం ఆధారంగా నిలబడే చోటు) , అలాగే ఏలాంటి ఆధారం లేదని శివలింగాలను చూడవచ్చు. 

 

Gyanvapi survey report photos show shivling, broken deity statues ksp

(Photo Courtesy : India Today)

వీటిలోనే పూర్వకాలం నాటి నాణేలు, పర్షియన్ భాషలో చెక్కబడిన ఇసుకరాయి స్లాబ్, ఒక రోకలి, విగ్రహాలు వంటి ఇతర వస్తువులను కూడా గమనించవచ్చు. జ్ఞానవాపీ వివాదానికి సంబంధించి హిందూ పక్షం .. 839 పేజీలతో ఫోటోలు, ఇతర ఆధారాలతో కూడిన నివేదికను ఇచ్చింది. జ్ఞానవాపీ మసీదు ఓ పురాతన హిందూ దేవాలయ శిథిలాలపై నిర్మించబడిందని ఈ నివేదిక తిరుగులేని సాక్ష్యాలను అందిస్తోంది. 

 

Gyanvapi survey report photos show shivling, broken deity statues ksp

(Photo Courtesy : India Today)

హిందూ వర్గం తరపున ప్రముఖ న్యాయవాది విష్ణుశంకర్ జైన్.. విరిగిన విగ్రహాల స్థానాలు, కొలతలను అక్కడ పురాతన ఆలయం వుండేదని చెప్పడానికి బలం చేకూరుస్తున్నాయని తెలిపారు. మసీదు నిర్మాణంలో కూల్చబడ్డ దేవాలయంలోని హిందూ దేవతల శిథిలాలు, ఆలయంలోని స్తంభాలను వినియోగించారని జైన్ నొక్కి చెప్పారు. 17వ శతాబ్ధంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనా కాలంలో ఆలయ కూల్చివేతకు సంబంధించిన వృత్తాంతాన్ని తెలిపేలా రాతి పలకలపై పర్షియన్ శాసనాలతో సహా నివేదికలో వివరాలు వున్నాయని జైన్ వాదించారు. 

 

Gyanvapi survey report photos show shivling, broken deity statues ksp

(Photo Courtesy : India Today)

జ్ఞానవాపి మసీదు వున్న ప్రదేశంలో ఒకప్పుడు గొప్ప హిందూ దేవాలయం వుండేదని పరిశోధనలు గట్టిగా సూచిస్తున్నాయని విష్ణుశంకర్ అంటున్నారు. 17వ శతాబ్ధంలో ఔరంగజేబు ఆదివిశ్వర ఆలయాన్ని కూల్చివేసినప్పుడు అక్కడ ఒక గొప్ప దేవాలయం పూర్వం వుండేదని ఈ ఆధారాలు సూచిస్తున్నాయని ఆయన పునరుద్ఘాటించారు.

 

Gyanvapi survey report photos show shivling, broken deity statues ksp

(Photo Courtesy : India Today)

అయితే అంజుమన్ అంజమియా మసీదు కమిటీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అఖ్లాక్ అహ్మద్ మాత్రం హిందూ పక్షం చేస్తున్న వాదనలు నిర్ద్వంద్వంగా ఖండించారు. నివేదికను కూడా ఆయన కొట్టిపారేశారు. ఏఎస్ఐ తన కొలతలు రాసింది కానీ.. హిందూ పక్షం వాదనలు నిరాధారమైనవని, వాటికి నిపుణుల ధృవీకరణ లేదని అహ్మద్ పేర్కొన్నారు. 

 

Gyanvapi survey report photos show shivling, broken deity statues ksp

(Photo Courtesy : India Today)

నిర్మాణానికి ఉపయోగించిన సామాగ్రి, శిథిలాల వయస్సును నిర్ణయించడంలో హిందూ పక్ష నైపుణ్యాన్ని కూడా అహ్మద్ ప్రశ్నించారు. ఏఎస్ఐ నివేదిక స్వయంగా రాతి వయసును పేర్కొనలేదని ఆయన ఎత్తి చూపారు. ఏఎస్ఐ నివేదికలో పేర్కొన్న ఛాయాచిత్రాలలో హిందూ దేవతల ప్రస్తావన, ఆ విగ్రహాలు ప్రామాణికమైనవి కావని అహ్మద్ తేల్చిచెప్పారు. 

కాగా.. గతేడాది జూలై 21న జిల్లా కోర్టు జారీ చేసిన ఆదేశాలను అనుసరించి భారత పురావస్తు శాఖ.. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేను నిర్వహించింది. దీనిలో భాగంగా మసీదును హిందూ ఆలయ శిథిలాలపై నిర్మించారా లేదా అనేది ఏఎస్ఐ నిర్ధారించింది. సర్వేను పూర్తి చేసి డిసెంబర్ 18న జిల్లాకు కోర్టుకు సీల్డ్ కవర్‌లో తన నివేదికను సమర్పించింది. 

 

Gyanvapi survey report photos show shivling, broken deity statues ksp

(Photo Courtesy : India Today)

Follow Us:
Download App:
  • android
  • ios