వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్‌వాపి మసీదు వివాదంపై నటి కంగనా రనౌత్ మాట్లాడారు. కాశీలోని ప్రతీ అణువులోనూ ఆ పరమ శివుడు ఉంటాడని చెప్పారు. ఇంకా ఆయనకు ప్రత్యేకంగా నిర్మాణం అవసరమే లేదని తెలిపారు. 

ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ ఎప్పుడూ వార్త‌లో నిలిచే న‌టి కంగనా ర‌నౌత్ తాగాజా జ్ఞాన్‌వాపి మసీదు అంశంపై స్పందించారు. కాశీలోని ప్రతీ కణంలోనూ శివుడు ఉన్నాడని, ఆయనకు నిర్మాణం అవసరం లేద‌ని అన్నారు. బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ తన రాబోయే సినిమా ‘ధాకడ్’ నుంచి ఓ పాట రిలీజ్ కోసం ఆమె బుధ‌వారం వార‌ణాసికి చేరుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా ఆమెతో పాటు సినిమా యూనిట్ మొత్తం క‌లిసి గంగా హారతి ఇచ్చారు. అనంత‌రం కాశీ విశ్వనాథ దేవాలయంలో ప్ర‌త్యేక ప్రార్థనలు చేశారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కోర్టు ఆదేశిత వీడియోగ్రఫీ సర్వేలో జ్ఞాన్‌వాపి మసీదులో కనిపించిన శివ‌లింగంపై జరుగుతున్న చ‌ర్చ‌పై ఆమెను అభిప్రాయం చెప్పాల‌ని మీడియా కోరింది. దీంతో కంగ‌నా ర‌నౌత్ స‌మాధానం ఇచ్చింది. 

Gyanvapi Mosque : వాస్తవాలు బయటకు రావాలి.. సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేం - ఆర్‌ఎస్‌ఎస్

‘‘ మధురలోని ప్రతీ కణంలో శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో, అయోధ్యలోని ప్రతీ కణంలో రాముడు ఎలా ఉంటాడో, అదే విధంగా కాశీలోని ప్రతీ కణంలో మహాదేవుడు ఉన్నాడు. వారికి ఎలాంటి నిర్మాణం అవసరం లేదు ’’ అని అంటూ ‘‘హర్ హర్ మహాదేవ్’’ అని అని కూడా నినాదాలు చేశారు. ఇదిలా ఉండ‌గా ‘ధాకడ్’ చిత్రంలోని ‘తు హై ధాకడ్’ పాటను వారణాసి నగరంలో చాలా వైభవోపేతంగా విడుదల చేశారు. విడుదల సమయంలో గంగా నది ఒడ్డున తేలియాడే ఎల్ ఈడీ స్క్రీన్ పై ఈ పాటను ఆలపించారు.

జ్ఞానవాపి మసీదు కేసు: సీల్డ్ కవర్లో కోర్టుకు సర్వే రిపోర్ట్, వారణాసి కోర్టుకు సుప్రీం కీలక ఆదేశం

ఈ పాట విషయంలో కంగనా రనౌత్ మాట్లాడుతూ.. మా ప్రచారంలో చివరి దశలో ‘తు హై ధాకడ్’ ను రిలీజ్ చేశామని తెలిపారు. ఎందుకంటే ఈ పాట సినిమా మొత్తం థీమ్ ను సెట్ చేస్తుంద‌ని అన్నారు. ఇది ఏజెంట్ అగ్నిని ఆపలేని శక్తిగా చూపిస్తుంద‌ని అన్నారు. ఈ పాటకు ఒక విశిష్ట‌త ఉంద‌ని, ఇది త‌న‌లోని ధృడ‌త్వాన్ని, శ‌క్తి సామ‌ర్థ్యాల‌న తెలియ‌జేస్తుంద‌ని తెలిపారు. 

Scroll to load tweet…

ఈ సాంగ్ ను ప్రముఖ అడ్వర్టైజింగ్, ఫిల్మ్ కంపోజర్ ధృవ్ ఘనేకర్ ట్యూన్ సెట్ చేశారు. దీనికి ప్ర‌ముఖ న‌డుటు, రచయిత అయిన ఇషిట్టా అరుణ్ లిరిక్స్ అందించాడు. ప్ర‌ముఖ జాజ్ కళాకారిణి వసుంధర వీ ప్ర‌దర్శ‌న అందించారు. అయితే ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోల‌ను కంగనా ర‌నౌత్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా అర్జున్ రాంపాల్, దివ్య దత్తా జంటగా నటించిన ఈ చిత్రం మే 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.