Gyanvapi case: వివాదాస్పద జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ మసీదు కాంప్లెక్స్‌లో సర్వేకు ఆదేశించిన వారాణసీ సివిల్ జడ్జి రవి దివాకర్‌కు బెదిరింపు వచ్చాయి. తనకు బెదిరింపు లేఖ వచ్చినట్లు మంగళవారం తెలిపారు. ఇస్లామిక్ అఘాజ్ మూవ్‌మెంట్‌కు చెందిన కాషిఫ్ అహ్మద్ సిద్ధిఖీ అనే వ్యక్తి నుంచి తనకు బెదిరింపు లేఖ వచ్చిందని వారాణసీ సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ చెప్పారు.
Gyanvapi case: వివాదాస్పద జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ మసీదు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదంలో సర్వేకు ఆదేశించిన జడ్జికి బెదిరింపు వచ్చాయి. జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ మసీదు సముదాయంలో వీడియో సర్వేకు తీయాలని ఆదేశించిన సీనియర్ డివిజన్ జడ్జి రవికుమార్ దివాకర్‌కు బెదిరింపుల లేఖ వచ్చింది. తనకు మంగళవారం నాడు బెదిరింపు వచ్చినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇస్లామిక్ అఘాజ్ మూవ్‌మెంట్‌కు చెందిన కాషిఫ్ అహ్మద్ సిద్ధిఖీ నుంచి బెదిరింపు లేఖ వచ్చినట్టుగా వారాణసీ సివిల్ జడ్జి తెలిపారు. న్యాయమూర్తి రవి దివాకర్ వివాదాస్పద జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ కాంప్లెక్స్‌లో సర్వేకు ఆదేశించారు.
గతంలో సుప్రీంకోర్టు జ్ఞానవాపీ కేసును సివిల్ కోర్టు నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. తదుపరి విచారణ జులై 4న జరగనుంది. ప్రస్తుతం భారతదేశంలో న్యాయవ్యవస్థ కూడా కాషాయ రంగును సంతరించు కుందని బెదిరింపు లేఖలో పేర్కొన్నట్లు జస్టిస్ దివాకర్ చెప్పారు.
ఈ మేరకు అదనపు ప్రధాన కార్యదర్శి (హోమ్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వారణాసి పోలీస్ కమిషనర్‌లకు వారణాసి సీనియర్ డివిజన్ న్యాయమూర్తి దివాకర్ లేఖ రాశారు. ఇందులో తనకు బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. అధికారులకు పంపిన లేఖలో 'ఇస్లామిక్ ఆగాజ్ ఉద్యమం'
తరపున ఈ లేఖ తనకు పంపినట్లు న్యాయమూర్తి రాశారు. జడ్జి దివాకర్‌కు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేఖ అందిందని ఆయన తెలిపారు. దానితో పాటు మరికొన్ని పేపర్లు అందినట్టు న్యాయమూర్తి వెల్లడించారు.
ఈ కేసు విచారణ బాధ్యతలను వారణాసి డిప్యూటీ పోలీస్ కమిషనర్ కు అప్పగించినట్లు ఆయన తెలిపారు. న్యాయమూర్తికి రక్షణగా తొమ్మిది మంది పోలీసులను మోహరించినట్లు వారణాసి పోలీసు కమిషనర్ తెలిపారు. అదే సమయంలో, ఈ విషయంపై విచారణ జరుగుతోంది. అంతే కాకుండా వారి భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
లేఖలో ఏమి వ్రాయబడింది
న్యాయమూర్తికి పంపిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ఇప్పుడు న్యాయమూర్తులు కూడా కాషాయ రంగును సంతరించుకున్నారు. అతివాద హిందువులను, వారి సంస్థలను ప్రసన్నం చేసుకునేందుకు ఈ తీర్పు వెలువరించబడింది. దీని తర్వాత.. విభజిత భారతదేశంలోని ముస్లింలపై నిందలు మోపారు. మీరు న్యాయపరమైన పని చేస్తున్నారు. మీరు ప్రభుత్వ యంత్రాంగానికి రక్షణ, అప్పుడు మీ భార్య, తల్లి ఎలా భయపడుతున్నారు? ఈరోజుల్లో న్యాయాధికారులు గాలిని చూస్తూ కుతంత్రం చూపిస్తున్నారు. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయాన్ని తనిఖీ చేయడం సాధారణ ప్రక్రియ అని మీరు ప్రకటన చేసారు. మీరు కూడా అన్యమతస్థుల మసీదును దేవాలయంగా ప్రకటిస్తారు. అని ఆ బెదిరింపు లేఖలో పేర్కొన్నారు.