Asianet News TeluguAsianet News Telugu

జ్ఞాన్‌వాపీ కేసులో కీలక పరిమాణం.. ఇంతకీ అసలు వివాదమేమిటీ? వివాదం ఎప్పుడు ప్రారంభమైందంటే..?

Gyanvapi Case: జ్ఞాన్‌వాపీ క్యాంపస్‌కు సంబంధించి ఇవాళ డివిజన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. ఈ కేసులో ముస్లిం వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. డివిజన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు  సివిల్  సీనియర్ జడ్జి మహేంద్ర కుమార్ పాండే కోర్టులో కిరణ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హమైనదిగా పరిగణించారు. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో దొరికిన శివలింగాన్ని పూజించే హక్కు, ముస్లింల ప్రవేశంపై నిషేధం, జ్ఞానవాపి ప్రాంగణంలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించడం వంటి కేసులను ఫాస్ట్ ట్రాక్ గురువారం విచారించింది. ఇంతకీ వివాదం ఎలా ప్రారంభమైంది. ఓ సారి ఈ కేసు పరిమాణ క్రమాన్ని పరిశీలిద్దాం.. 

Gyanvapi Case UP Court To Hear Plea For Prayers At Shivling At Mosque
Author
First Published Nov 17, 2022, 6:19 PM IST

జ్ఞాన్‌వాపీ క్యాంపస్‌కు సంబంధించి ఇవాళ డివిజన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక నిర్ణయం . ఈ కేసులో ముస్లిం వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో దొరికిన శివలింగాన్ని పూజించే హక్కు, జ్ఞానవాపి ప్రాంగణంలో ముస్లింల ప్రవేశంపై నిషేధం, జ్ఞానవాపి ప్రాంగణంలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించడం వంటి కేసులను ఫాస్ట్ ట్రాక్ గురువారం విచారించింది. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో సివిల్‌ జడ్జి మహేంద్ర పాండే కోర్టులో విశ్వవేద సనాతన్‌ సంఘ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 

అయితే.. ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని ముస్లిం పక్షం కోరింది. మహేంద్ర కుమార్ పాండే కోర్టులో కిరణ్ సింగ్ తరపున దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హమైనదిగా పరిగణించింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ డిసెంబర్ 2వ జరుగుతోందని కోర్టు ప్రకటించింది. కిరణ్ సింగ్ మే 24న పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో వారణాసి జిల్లా మేజిస్ట్రేట్, పోలీస్ కమిషనర్, అంజుమన్ ఇంతేజామియా కమిటీతో పాటు విశ్వనాథ్ ఆలయ ట్రస్టును ప్రతివాదులుగా చేశారు. 

అనంతరం మే 25న జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎ.కె. విశ్వేష్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేశారు. జ్ఞాన్‌వాపి క్యాంపస్‌లోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని, క్యాంపస్‌ను హిందువులకు అప్పగించాలని, అలాగే క్యాంపస్‌లో కనిపించే శివలింగాన్ని క్రమం తప్పకుండా పూజించే హక్కును ఇవ్వాలని కిరణ్ సింగ్ తన పిటిషన్‌లో కోరారు. అంతకుముందు మే నెలలో కోర్టు ఆదేశాల మేరకు జ్ఞాన్వాపి-శృంగర్ గౌరీ కాంప్లెక్స్‌లో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించారు.  

అసలు సమస్య ఏంటీ.. జ్ఞానవాపి క్యాంపస్‌లో ఓ వైపు మసీదు ఉంది. మసీదు పక్కనే కాశీ విశ్వనాథ దేవాలయం ఉంది. మొగల్ చక్రవర్తి ఆ ఆలయాన్ని కూల్చివేసి .. ఆ స్థానంలో మసీదు నిర్మించారని చెబుతుంటారు. అటువంటి పరిస్థితిలో.. ఈ వివాదంలో మొదటి నుండి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను తెలుసుకుందాం..  

అసలు వివాదమేమిటీ? 
 
జ్ఞానవాపిలో 100 అడుగుల ఎత్తైన ఆది విశ్వేశ్వరుని స్వీయ-వ్యక్త జ్యోతిర్లింగం ఉందని హిందూ పక్షం పేర్కొంది. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని మహారాజా విక్రమాదిత్యుడు సుమారు 2050 సంవత్సరాల క్రితం నిర్మించాడు. అయితే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1664 సంవత్సరంలో ఈ ఆలయాన్ని కూల్చివేశాడు. ఈ స్థలంలోనే ప్రస్తుతం ఉన్న జ్ఞానవాపి మసీదు నిర్మించబడిందని వాదన.

జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లో పురావస్తు సర్వే నిర్వహించి భూగర్భంలో ఉన్నది ఆలయ అవశేషాలా కాదా అని తేల్చాలని పిటిషనర్లు కోరారు. వివాదాస్పద కట్టడాన్ని కూల్చడమే కాకుండా.. 100 అడుగుల ఎత్తైన జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసి.. మసీదు నిర్మాణంలో ఉపయోగించారనేది హిందూ పక్షం వాదన. మసీదు గోడలను కూడా పరిశీలించి అవి ఆలయానికి చెందినవా? కాదా? అని తెలుసుకోవాలి. జ్ఞానవాపి మసీదు కాశీ విశ్వనాథ ఆలయ అవశేషాల నుండి నిర్మించబడిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వాదనలను విన్న న్యాయస్థానం ఓ కమిటీని నియమించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందాన్ని జ్ఞాన్వాపీ క్యాంపస్‌లో సర్వే చేయాలని కోరారు.  

ఇంతకీ ఈ వివాదానికి సంబంధించి ఏం జరిగింది?

1991లో కాశీ విశ్వనాథ్ జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టులో మొదటి కేసు దాఖలైంది. జ్ఞాన్వాపీ క్యాంపస్‌లో పూజలకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. పురాతన విగ్రహం స్వయంభూ భగవంతుడు విశ్వేశ్వర్ తరపున సోమనాథ్ వ్యాస్, రామరంగ్ శర్మ, హరిహర్ పాండేలు వాదులుగా ఉన్నారు.

కేసు నమోదైన కొన్ని నెలల తర్వాత..సెప్టెంబర్ 1991లో కేంద్ర ప్రభుత్వం పూజా స్థలం చట్టాన్ని రూపొందించింది. 1947 ఆగస్టు 15కి ముందు ఉనికిలోకి వచ్చిన ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని ఇతర మతాల ప్రార్థనా స్థలంగా మార్చకూడదని ఈ చట్టం చెబుతోంది. అలా ఎవరైనా ప్రయత్నిస్తే ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు.

ఆ సమయంలో అయోధ్య కేసు కోర్టులో ఉంది. కాబట్టి ఈ చట్టం నుండి వేరుగా ఉంచబడింది. కానీ జ్ఞాన్వాపి కేసులో ఈ చట్టాన్ని ఉదహరిస్తూ, మసీదు కమిటీ హైకోర్టులో పిటిషన్‌ను సవాలు చేసింది.1993లో అలహాబాద్ హైకోర్టు స్టే విధిస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఏ కేసులోనైనా స్టే ఆర్డర్ చెల్లుబాటు ఆరు నెలలు మాత్రమే ఉంటుందని 2018లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఆర్డర్ అమలులో ఉండదు. ఈ ఉత్తర్వు తర్వాత..2019లో వారణాసి కోర్టులో ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది. 

వివాద పరిణామ క్రమం.. 

>> 2021లో వారణాసి సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ జ్ఞానవాపి మసీదు యొక్క పురావస్తు సర్వేను ఆమోదించింది. ఈ ఉత్తర్వు  మేరకు  కమిషన్‌ను నియమించబడింది. మే 6, 7 తేదీల్లో ఇరుపక్షాల సమక్షంలో శృంగర్ గౌరీని వీడియోగ్రఫీకి ఆదేశించింది. మే 10లోగా దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని కోర్టు కోరింది.

>> మే 6వ తేదీన తొలిరోజే సర్వే చేయగా.. మే 7వ తేదీన ముస్లిం పక్షం నిరసనకు దిగింది. ఈ  విషయం కోర్టుకు చేరింది.

>> మే 12న ముస్లిం పక్షం పిటిషన్‌పై విచారణ జరిగింది. కమిషనర్‌ను మార్చాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చిన కోర్టు.. మే 17లోగా సర్వే పనులు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఎవరైనా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అయితే సర్వే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని సూచించారు.

>> మే 14న ముస్లిం పక్షం పిటిషన్‌పై అత్యవసర విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జ్ఞానవాపి మసీదులో సర్వేను నిషేధించాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు. యథాతథ స్థితిని కొనసాగించడానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం,పేపర్లు చూడకుండా ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. ఇప్పుడు ఈ కేసు మే 17న విచారణకు రానుంది.

>> మే 14 న మళ్లీ జ్ఞానవాపి సర్వే పనులు ప్రారంభమయ్యాయి. ఈ మొత్తం ప్రక్రియను వీడియో,ఫోటోగ్రఫీ కూడా జరిగింది.

>> మే 16న సర్వే పనులు పూర్తయ్యాయి. బావిలో లింగం దొరికిందని హిందూ పక్షం పేర్కొంది. అనేక హిందూ మతాన్ని సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయని హిందూ మత సంస్థలు ఆరోపించాయి. అదే సమయంలో ముస్లింల పక్షం మాత్రం సర్వేలో ఏమీ కనిపించలేదన్నాని, హిందూ మత సంస్థలు తప్పుడు ఆరోపణలు చేశాయని అన్నాయి. 

>> మే 24న కిరణ్ సింగ్ అనే వ్యక్తి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో.. జ్ఞాన్‌వాపి క్యాంపస్‌లో ముస్లింలు ప్రార్థనలు చేయడాన్ని నిషేధించాలని, ఆ క్యాంపస్‌ను హిందువులకు అప్పగించాలని, సర్వే సమయంలో క్యాంపస్‌లో శివలింగం బయటపడిందని, ఆ శివలింగానికి నిత్యం పూజలు చేయడానికి  అనుమతించాలని డిమాండ్ చేశారు.

>> మే 25న జిల్లా జడ్జి ఎకె విశ్వవీర ఈ  పిటిషన్‌ను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలి చేశారు.  

>> అక్టోబరు 15న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఇరుపక్షాల వాదనలను పూర్తిగా విన్నగా.. ఆ తీర్పును రిజర్వ్ చేసింది. 

>> అక్టోబర్ 27న  ఉత్తర్వులు జారీ చేసేందుకు నిర్ణయించారు. కానీ, పలు కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని నవంబర్ 8 ని వాయిదా చేశారు.  కానీ, న్యాయమూర్తి సెలవులో ఉన్నందున నవంబర్ 8న ఉత్తర్వులు రాలేదు.

>> నవంబర్ 14న ఈ కేసులో కోర్టుతీర్పు చెప్పేందుకు నవంబర్ 17వ తేదీని ఇచ్చింది. 

>> నవంబర్ 17న ఈ విషయంలో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతం జ్ఞాన్‌వాపి మసీదులో నమాజ్ చేయడానికి కొంత మందిని మాత్రమే పరిపాలన అనుమతించింది. నిత్యం ఇక్కడ నమాజ్ చేసే వారు. ఈ వ్యక్తులు తప్ప, ఇక్కడ నమాజ్ చేయడానికి ఎవరికీ అనుమతి లేదు. కాగా, మసీదు పక్కనే ఉన్న కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆలయ ప్రాంగణంలో గతం కంటే భక్తుల రద్దీ పెరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios