20 సెకన్లు ఉన్న ఈ వీడియో చూసిన వారు ఎవ్వరూ మళ్లీ పానీపూరీ ముట్టుకోవండానికి కూడా ఇష్టపడరేమో.
పానీపూరీ... దీనిని ఇష్టం గా ప్లేట్లకి ప్లేట్లు లాంగించేవారు మనలో చాలా మందే ఉన్నారు. అయితే.. ఈసారి పానీపూరీ తినేముందు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే.. ఈ వీడియో చూసినవారెవ్వరూ.. ఇంకోసారి పానీపూరీ కనీసం ముట్టుకోవడానికి కూడా భయపడిపోతారు. ఓ పానీపూరీ అమ్మే వ్యక్తి.. ఆ నీటిలో.. మూత్రం కలిపాడు. ఈ సంఘటన గువహటిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గువహటిలో ఓ పానీపూరీ అమ్మే వ్యక్తి.. ఆ పానీలో మూత్రం కలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. 20 సెకన్లు ఉన్న ఈ వీడియో చూసిన వారు ఎవ్వరూ మళ్లీ పానీపూరీ ముట్టుకోవండానికి కూడా ఇష్టపడరేమో. మమూన్ ఖాన్ అనే వ్యక్తి.. దీనిని ట్విట్టర్ లో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఆ వీడియోలో.. ఓ వ్యక్తి. మూత్రాన్ని పానీపూరీ బకెట్ లో కలపడం స్పష్టంగా కనపడుతోంది.
ఆ పానీపూరీ వెండార్ ని అరెస్టు చేయాలంటూ.. ఈ వీడియోని షేర్ చేయడం గమనార్హం. కాగా.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియో చూసి వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
