జులై 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్..? ప్రభుత్వం నిర్ణయం

ఈ క్రమంలో ఉద్యోగులకు కొంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమే బెటర్ అని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. హర్యానా ప్రభుత్వం మాత్రం నిర్ణయం తీసేసుకుంది.

Gurugram MNCs to work from home till July-end

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ విధించినప్పటికీ కేసుల సంఖ్య పెరగుతోంది. ఈ నేపథ్యంలో.. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఎలాంటి సడలింపులు లేకుండా లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ... కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ కలవరపెడుతోంది.

ఈ లాక్ డౌన్ కారణంగా జర్నలిస్టులు, వైద్యులు, పోలీసులు తప్ప.. మరెవరీ ఆఫీసులకు వెళ్లి విధులు నిర్వహించడం లేదు. ముఖ్యంగా ఐటీ కంపెనీల ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ని వాడుకుంటున్నారు. మళ్లీ లాక్ డౌన్ తర్వాత వీరంతా ఆఫీసులకు వెళ్లక తప్పదు. అప్పుడు కరోనా మళ్లీ తిరగపెట్టే ప్రమాదం లేకపోలేదు.

ఈ క్రమంలో ఉద్యోగులకు కొంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమే బెటర్ అని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. హర్యానా ప్రభుత్వం మాత్రం నిర్ణయం తీసేసుకుంది.

ఈ ఏడాది జులై నెలాఖరు వరకు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా చూడాలని గురుగ్రామ్ నగరానికి చెందిన పలు బహుళజాతి ఐటీ కంపెనీలను హర్యానా సర్కారు ఆదేశించింది. గురుగ్రామ్ నగరంలోని ఎంఎన్‌సీలు, బీపీఓలు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సంస్థలు జులై 31వతేదీ వరకు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించాలని తాము కోరినట్లు గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ సీఈవో వీఎస్ కుందూ చెప్పారు. 

డీఎల్ఎఫ్ సహా పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణపనులు ప్రారంభించేందుకు తాము గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని హర్యానా అదనపు ప్రధాన కార్యదర్శి అయిన కుందూ వెల్లడించారు. అయితే కరోనా వైరస్ ప్రబలకుండా కార్మికులు, ఉద్యోగులు సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని సూచించామని కుందూ వివరించారు. 

దేశ రాజధాని నగర సమీపంలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో భాగమైన గురుగ్రామ్ ను మిలీనియం సిటీగా పిలుస్తారు. ఈ మిలీనియం సిటీలో ఇన్ఫోసిస్, జెన్‌పాక్ట్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా అనేక బీపీఓలు,ఎంఎన్‌సి కంపెనీలు టెక్నాలజీ దిగ్గజ కంపెనీలున్నాయి.

 కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో మార్చి నెలలోనే కంపెనీల ఉద్యోగులు ఇళ్ల వద్ద నుంచి పనిచేసేలా అనుమతించాలని గురుగ్రామ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా అదుపులోకి రానందువల్ల జులై నెలాఖరు వరకు అన్ని కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేలా చూడాలని ఆదేశాలు ఇచ్చినట్లు కుందూ వివరించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios